బిసిలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంది కపట ప్రేమ
*బిసిలపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంది కపట ప్రేమ*.
*చెల్లదని తెలిసి జీవో తో కోర్టుకు వెళ్లడం మూర్ఖత్వం*.
*బిసి సమాజంను ఓట్ల కోసం పావుగా వాడుకున్న కాంగ్రెస్ పార్టీ.*
జగిత్యాల: బిసి ల పట్ల కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వ్యవహారిస్తున్న కపట ప్రేమ హైకోర్టు తీర్పుతో బయటపడిందని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడాతు....
కామారెడ్డి డిక్ల రేషన్ తో బిసి సమాజాన్ని అయోమయం కు గురి చేసిందన్నారు. బిసి కులాలను ఆశల పల్లకిలో నెట్టి, చెల్లని జీవోతో బిసి సమాజం తో చెలగాటం ఆడిందన్నారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం పోగొట్టిందని, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనం కొరకే బిసిలను వాడుకుందని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో బిసిల కోసం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి, సంక్షేమం శూన్యం అని అన్నారు. గవర్నర్ దగ్గర, అటు రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా జీవో 9 తో ఎన్నికలకి ఎలా వెళ్తారానే సోయి అటు ప్రభుత్వం కు, ఇటు ప్రభుత్వ, పార్టీ పెద్దలకు, సలహాదారులకు లేకపోవడం విచారకరం అన్నారు. కేవలం బిసి ల ఉద్దారణ కు తామేమో చేస్తున్నామన్న భ్రమను కల్పించేందుకు కుప్పి గంతులు వేసి మభ్య పెట్టాలని చుసిన వ్యూహం బేడిసి కొట్టిందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బిసి ల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక ఆ పథకాలు కనుమరుగయ్యయని విమర్శించారు. గంగపుత్ర, ముదిరాజ్ లకు సంబంధించిన చేపల పంపిణి నేటికీ అరంభం కాకపోవడమే ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం అని అన్నారు. గౌడన్న లకు చెట్టు పన్ను మాఫీ చేసి, ప్రమాదవశత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు బీమా కల్పించి, మరియు గొల్ల కురుమలకు గోర్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిదే అని అన్నారు.బిసి ల విద్యకై అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసి, నాణ్యమైన విద్య, భోజనం అందించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిస్థితి దుర్బరంగా మారిందన్నారు. బిసిలకు రాజ్యాంగ పరంగా హక్కులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, కానీ సుప్రీం కోర్ట్ నెపంతో మరొమారు ఎన్నికల వాయిదా కోసం ప్రభుత్వమే కృషి చెయ్యడం విడ్డురంగా ఉందన్నారు. ఇప్పటికైనా బిసి సమాజం మేల్కొని కాంగ్రెస్ కపట వైఖరిని గమనించాలని కోరారు. బిసిలా చైతన్యం తోనే రాజ్యాధికారం సాధ్యమని, ఆ దిశగా బిసి సమాజం ముందుకు సాగాల్సిన అవసరం ఏంతైనా ఉందన్నారు. బిసి రిజర్వేషన్ ల విషయం లో కొంత మంది బిసి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కు అనుకూలంగా వ్యవహరించడం విచకరమని, బిసి సమాజం కోసం పోరాటం కు సిద్ధం అవ్వాలని అన్నారు. పరిపాలన చేత గాక ప్రతిపక్షాలపై నిందలు వేయడమా...? ప్రజా కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఎప్పటికైనా తెలంగాణకు కేసిఆర్ గారే శ్రీరామరక్ష అని అన్నారు. ఈ సమావేశం లో మండల అధ్యక్షుడు ఆనంద్ రావు మాజీ సర్పంచ్ బుర్ర ప్రవీణ్ గౌడ్ BRS నాయకులు బందేల శేఖర్ మహేష్ గౌడ్ రాకేష్ వెంకటేష్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.