సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పేషంట్
సౌదీ నుంచి హైదరాబాద్ కు కోమా పెషేంట్
◉ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవ
◉ 'సీఏం ప్రవాసీ ప్రజావాణి' సమన్వయం
చురకలు ప్రతినిధి
కరీంనగర్
గత ఎనభై రోజులుగా, సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో సౌదీ ఎయిర్ లైన్స్ విమానంలో స్ట్రెచర్ పై మెడికల్ ఎవాక్యుయేషన్ చేస్తున్న పెషేంట్ తో అతని భార్య తెనుగు అశ్విని ప్రయాణిస్తున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ కు చేరిన పెషేంట్ ను దక్కన్ హాస్పిటల్ లో చేరుస్తారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎల్కతుర్తి కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లోకిని క్రిష్ణమూర్తి (35) సౌదీలో
జూలై 23న అపస్మారక స్థితికి చేరారు. అధిక బీపీ తో, మెదడులోని రక్తనాళాలు చిట్లి కోమాలోకి జారిపోయిన అతనికి, రియాద్ లోని ఎస్ఎంసీ ఆసుపత్రిలో కోమా స్థితిలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ప్రత్యేక చొరవతో తెలంగాణ ప్రభుత్వం సౌదీలోని ఇండియన్ ఎంబసీతో సంప్రదించి పెషేంట్ ను వాపస్ తెప్పించడానికి కృషి చేశారు. సౌదీ లోని గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు మహ్మద్ జబ్బార్ సమన్వయం చేశారు. సహాయం కోసం పెషేంట్ తండ్రి సూరయ్య గతనెల 9న 'సీఏం ప్రవాసీ ప్రజావాణి' లో వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి మార్గదర్శనం చేశారు.
#Adminpost