పార్టీ బలోపేతం కోసం అంకిత భావం తో పని చేయండి
*పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పని చేయండి*
*కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ ఐ సి సి పరిశీలకుడు*
*డా, నరేశ్ కుమార్, టీపీసీసీ ఆర్గనైసర్, అబ్జర్వర్ ,జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గారు.*
పార్టీ సంగతన్ సృజన్ అభియాన్‌లో భాగంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులు డా, నరేష్ కుమార్, టీపీసీసీ ఆర్గనైసర్, అబ్జర్వర్ ,జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మరియు అనేక మంది ఇతర నాయకులతో అసిఫాబాద్ జిల్లాలో ఎఐసిసి పరిశీలకుడు మరియు పార్టీ సీనియర్ నాయకులు స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
*ఈసందర్భంగా వారు మాట్లాడుతూ..*
కాంగ్రెస్ హై కమాండ్ తెలంగాణలో స్థానిక నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు నడుం బిగించిందన్నారు.
ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం “సంఘటన్ సృజన్ అభియాన్” కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ సంగథన్ సృజన్ అభియాన్‌ను ప్రారంభించనున్నారు .
పార్టీ పునాదిని బలోపేతం చేయడానికి, అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న మంచి పార్టీ కార్యకర్తలు మరియు నాయకులకు ప్రోత్సాహాన్ని అందించడానికి మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడానికి మరియు తరువాత బ్లాక్, మండల్ మరియు బూత్ స్థాయి యూనిట్లు, సంగథన్ సృజన్ అభియాన్ ప్రారంభించబడింది. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమిస్తారు. కార్యనిర్వాహక కమిటీలు మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ కూడా ఏర్పాటు చేయబడతాయి. ఈ వ్యాయామం వెనుక ప్రధాన లక్ష్యం పార్టీ సంస్థలో గరిష్ట వ్యక్తులకు బాధ్యత ఇవ్వడం, తద్వారా వారు కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో మరియు ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
ఈ కార్యక్రమంలలో టైపిసిసి వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్,ఎమ్మెల్సీ విఠల్, టిఫిసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ, బిసిసి విశ్వ ప్రసాద్ రావు, బాలేష్ గౌడ్, మల్లేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పీసీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, అసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు గుండ శ్యామ్, మహిళా నాయకులు, యూత్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.