గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంతకర్త మళ్ళొజుల, మరో సిసి మెంబర్ ?
గన్ డౌన్ చేసిన మావో సిద్ధాంత కర్త.!
మల్లోజుల వెంట మరో సీసీ మెంబర్ ఆశన్న
నక్సలైటు చరిత్రలో పెద్ద కుదుపు.!
మల్లోజుల వేణు రేపు ఏమీ చేస్తారు.!!
చురకలు ప్రత్యేక ప్రతి నిధి
-
రెండేళ్ల కిందట తలపెట్టిన ఆపరేషన్ కాగర్ తో అనేక ఎదురు దెబ్బలు ఎదుర్కొన్న మావోయిస్టు పార్టీ కొత్త చిక్కుల్లో పడింది.సాయుధపోరాట పార్టీ నుంచి వచ్చిన విరమణ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెనుక మల్లోజుల వేణుగోపాలరావు పాత్ర ఉందని చెబుతున్నారు. అయితే ఆయన పార్టీ నుంచి బయటకు రావడానికి ముందే సాయుధ పోరాటానికి విరమణ చేయాలని కూడా పత్రికలకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.దీంతో పార్టీ నుంచి రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి.ఒకరిది సాయుధ పోరాటంలో భాగమేనని…మల్లోజుల సాయుధం వద్దు,ప్రజాస్వామిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని,పోరాటానికి సిద్ధంగా ఉండాలని మల్లోజుల వేణుగోపాల్ రావు చెప్పారు.నెల రోజుల్లో మావోయిస్టు టాప్ నేతల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.ఈలోగా పార్టీ నేతలు జగన్ మనసు మార్చుకొనిఉన్న అభయ్ అలియాస్ మల్లోజుల కు వ్యతిరేకంగా లేఖ రాశారు.
అది తన పూర్తి వ్యక్తి గతం..పార్టీ విధానం ప్రకారం ఆయన పై అనర్హత వేటుకు కారణం అవుతుంది అని స్పష్టం చేశారు.మరో వైపు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మరో అభయ్.డికే నుండి వికల్ప్ ద్వారా వచ్చిన ఈ లేఖలో మరింత తీవ్రంగా మందలిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఈ నేపద్యంలో ఇక మల్లోజుల వేణుగోపాల్ రావు ఏడాది కాలంలో చేసిన శాంతి చర్చల గురించి వివరించారు.తాను పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న నంబాల కేశవరావు సూచన మేరకే రూపేష్ ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పారు.కేంద్రం నుండి ఎలాంటి సహకారం అందలేదని నంబల్లా సైతం గుర్తించి సాయుధ పోరాటానికి విరమణకు ఒప్పించాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన ఎన్కౌంటర్ అయ్యారని చెప్పారు.ఇది నా అభిప్రాయం కాదని చెప్పారు.తాను సాయుధ పోరాటానికి స్వస్తి పలికినట్టు గా అంగీకరిస్తూ తుపాకులు దించి మారిన పరిస్థితులు సాధారణంగా అంచనా వేసి ఉద్యమా లను నడిపెండుకు వచ్చిన మల్లోజుల ప్రభుత్వానికి లొంగిపోయినట్లు సమాచారం అందింది.ఐతే సరెండర్ అయిన మల్లోజుల సహా ఆశన్న అలియాస్ తక్కళ్లపల్లి వాసుదేవ రావు ఏమీ ఆశించకుండా మళ్లీ ప్రజా స్వామిక ఉద్యమాలు చేస్తారా చూడాలి
పోలీస్ గూటికి చేరారా.?!
గన్స్ డౌన్ చేసిన తర్వాత ఇద్దరు ముఖ్య నేతలు అభయ్,రూపేష్ లు గురువారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు.ఈ ప్రచారం అంతా మీడియా ద్వారా జరిగింది. అయితే ఈ ఇద్దరిపై మాత్రం కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.మునుపటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మల్లోజుల,తక్కల్లా పల్లి లు వచ్చారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఓ కార్యక్రమంలో వీరి పేర్లు ప్రకటించి లొంగుబాటు వెల్లడించే అవకాశం ఉంది.