కోవర్ట్ ఆపరేషలో భాగమే కేంద్ర కమిటీ సభ్యుల హత్య, పౌరహక్కుల సంఘం
కోవర్ట్ ఆపరేషన్ లో భాగమే కేంద్ర కమిటీ సభ్యుల హత్య.
పౌరహక్కుల సంఘం
చురకలు ప్రతి నిధి
హైదరాబాద్, సెప్టెంబర్, 22
చత్తీస్ ఘడ్ రాష్ట్రం , నారాయణపూర్ జిల్లాలో ని ఆభుజ్ మాడు అడవుల్లో 20 సెప్టెంబర్ నాడు జరిగిందని చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారని వార్తలు అందుతున్నాయని,ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి అలియాస్ రాజు, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస మృతి చెందినట్లు చత్తీస్గడ్ పోలీసులు ప్రకటించారు. ఈ ఎన్కౌంటర్ నిర్ద్వందంగా బూటకమని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు సాధారణంగా పటిష్టమైన గార్డుల రక్షణ వలయంలో ఉంటారని, వీరు కనుక చనిపోయారంటే రక్షణగా నిలిచిన గార్డులు కూడా మృత్యువాత పడాలని,రక్షణ వలయానికి సంబంధించిన సమాచారం పోలీసులు ప్రకటించలేదని వారు పేర్కొన్నారు. ఈ ఎన్ కౌంటర్ కచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగా జరిగినట్లుగా అర్థమవుతుందని,కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అనైతిక యుద్ధం గత 21 నెలలుగా కొనసాగిస్తున్నదని, ఈ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రజా సమస్యల పరిష్కారం పైన దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో వెంటనే చర్చల ప్రక్రియ చేపట్టాలని,ఇన్ ఫార్మర్ల వ్యవస్థను, కోవర్ట్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడంలో అమాయకపు ఆదివాసీలను ఉపయోగిస్తున్నదని,డీ ఆర్ జీ దళాలు చట్ట వ్యతిరకం. ఆదివాసీల జీవితాలతో చెలగాటమాడటం కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని కోరారు. దండకారణ్యంలో మోహరించిన అన్ని రకాల బలగాలను వెంటనే ఉపసంహరించాలని, ఈ ఎన్కౌంటర్ పైన న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.