మెటఫండ్ పేరిట భారీ మోసం నలుగురు నిండుతుల అరెస్ట్

మెటఫండ్ పేరిట భారీ మోసం నలుగురు నిండుతుల అరెస్ట్

మెటా ఫండ్ పేరిట భారీ మోసం.

నలుగురు నిందితులు అరెస్టు.


చురకలు ప్రతినిధి, కరీంనగర్, సెప్టెంబర్ 11: కరీంనగర్ జిల్లాలో మెటా ఫండ్ అనే నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ కంపెనీ పేరుతో ప్రజలను మోసగించిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన వరాల లోకేశ్వర్ రావు అనే వ్యక్తి, మెటా ఫండ్ పేరుతో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో డబ్బులు పెడితే మూడు రెట్లు లాభం వస్తుందని ప్రజలను నమ్మబలికాడు. అతడితో చేతులు కలిపి కరీంనగర్‌కు చెందిన బూర శ్రీధర్, తులసి ప్రకాష్, దాసరి రమేష్, దాసరి రాజు ఈ మోసంలో భాగస్వాములయ్యారు. వీరంతా కలిసి 8 మంది బాధితుల నుండి సుమారు రూ.54,65,000/- (యాభై నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు) వసూలు చేశారు. సేకరించిన డబ్బును తమ స్థానిక శ్రీ రామ టింబర్ డిపోలో తీసుకొని, బాధితులకు నకిలీ ఐడీలను సృష్టించి మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన క్రమంలో, కరీంనగర్ పోలీసులు కరీంనగర్ కు చెందిన నిందితులు బూర శ్రీధర్ (55), తులసి ప్రకాష్ (56), దాసరి రమేష్ (59), మరియు దాసరి రాజు (39) లను అరెస్ట్ చేసి కోర్టు ఉత్తర్వుల మేరకు జైలుకు తరలించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అయిన వరాల లోకేశ్వర్ రావు ఇంకా పరారీలో ఉన్నాడు. అతన్ని త్వరలో పట్టుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు.
సాధారణ ప్రజలు ఇటువంటి మూడు రెట్లు లాభం, ఇన్వెస్ట్మెంట్ స్కీములు, నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ వంటి మోసపూరిత పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కేసును ఛేదించి నిందితులను పట్టుకొనుటలో కృషి చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్ .ప్రకాష్, ఎస్సైలు తోట తిరుపతి, నేరేళ్ళ రమేష్,  హెడ్ కానిస్టేబుల్ హసన్, కానిస్టేబుల్  అనిల్, ఖలీఫా లను పోలీసు కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.IMG-20250912-WA0067

Tags: