పార్టీ సంస్థగత నిర్మాణన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

పార్టీ సంస్థగత నిర్మాణన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

*పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం*


*బెల్లంపల్లి జిల్లా కేంద్రంలో మారుతి గార్డెన్స్ కాంగ్రెస్ పార్టీ "సంఘటన్ శ్రీజన్ అభియాన్" కార్యక్రమం ఏఐసీసీ పరిశీలకుడు డా నరేష్ కుమార్, టిపిసిసి ఆర్గనైజర్ , అబ్జర్వర్ జగిత్యాల తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువల జ్యోతి లక్ష్మణ్ నిర్వహించారు.*


ప్రతి గ్రామంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని బలపరిచేందుకు బూత్ కమిటీలు ఏర్పాటు చేయడం, కార్యకర్తలను సమన్వయం చేయడం, ప్రజలతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీలను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం, కార్యకర్తలతో సమన్వయం పెంచడం, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం ఈ అభియాన్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. నాయకత్వ మార్పుతో పాటు ప్రతి కార్యకర్తకు బాధ్యతాభారాన్ని పెంపొందించడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు.


పార్టీ ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు, మహిళలకు మరింత అవకాశాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చగల ఏకైక శక్తిగా ఉన్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పీసీసీIMG-20251017-WA0074 అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్,పీసీసీ అబ్జర్వర్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, జి సిసి చైర్మన్ కోట్నాక తిరుపతి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ,ఎమ్మెల్సీ దండే విటల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, పిసిసి మెంబర్ నూకల రమేష్,పీసీసీ మెంబర్ కొండ శేఖర్, జిల్లా యూత్ అధ్యక్షులు అనిల్, జిల్లా మహిళా అధ్యక్షులు పెంట రజిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు రామగిరి బానేష్, ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి బియాల తిరుపతి, సిరిపురం రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, లక్షట్ పేట్ టౌన్ సెక్రెటరీ ఎండి ఆరిఫ్, పట్టణ బ్లాక్ అద్యక్షులు నతిమేల రాజు, మండల అధ్యక్షులు వంగిలి రమేష్, తోట రవి, వెంకటేశ్వర్లు, ఆర్ టి ఏ మెంబర్ ఆపతి శ్రీనివాస్,ఏ యం. సి మంచిర్యాల్ పత్యాల పద్మ,ఏ, యం, సి లక్షట్ పేట్ దాసరి ప్రేమ్ చందు ఆత్మ చైర్మన్ సంఘవి మురళి, మహిళా నాయకులు, యూత్ నాయకులు, మండల నాయకులు, తదితరులు, పాల్గొన్నారు.

Tags: