మేటాఫండ్ పేరుతొ భారీ క్రిప్టో స్కాం

మేటాఫండ్ పేరుతొ భారీ క్రిప్టో స్కాం

మేటా ఫండ్ పేరుతో భారీ క్రిప్టో స్కాం!

జగిత్యాల జిల్లాలో మరోసారి క్రిప్టో పేరుతో మోసం సంచలనం సృష్టించింది..!

జగిత్యాల, అక్టోబర్, 09

‘మెట ఫండ్’ పేరుతో పెట్టుబడులు పెడితే మూడు రెట్లు వస్తాయంటూ మోసగాళ్లు అమాయకులను ఉరితీశారు.
ఈసారి సాధారణ ప్రజలు కాదు పోలీస్ ఉన్నతాధికారులు, ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు కూడా ఈ స్కాంలో చిక్కుకున్నారు. పెట్టుబడి పెట్టండి… మూడు నెలల్లో మూడు రెట్లు వస్తాయంటూ ఆశ చూపి లక్షల్లో డబ్బులు సేకరించినట్లు సమాచారం. వీరందరినీ మోసం చేసిన వారు జగిత్యాల కేంద్రానికి చెందిన ఓ ఫోటోగ్రాఫర్, కొడిమ్యాల మండలానికి చెందిన ఓ బిజెపి నాయకుడు. ఫోటోలు తీయడమే కాదు, ప్రముఖులను జాలంలో ఇరుకున పెట్టడంలో కూడా నిపుణుడయ్యాడు ఆ ఫోటోగ్రాఫర్..! ‘మెట ఫండ్ క్రిప్టో కంపెనీ’ గత సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమై, పెద్ద ఎత్తున పెట్టుబడులు సేకరించింది. తర్వాత లాభాలు ఇవ్వకపోవడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. ఇటీవల కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో కొంతమంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్థానికులు మాత్రం ఇలాంటి కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.IMG-20251009-WA0025

Tags: