హత్యా కేసులో నిందుతుల అరెస్ట్

హత్యా కేసులో నిందుతుల అరెస్ట్

హత్య కేసులో నిందితుల అరెస్టు...


వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘు చందర్...

చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 29:  జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామంలో జరిగిన ఈ నెల 27న హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. సోమవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రేచపల్లి గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీష్ తన ఇంస్టాగ్రామ్ లో ఓ అమ్మాయితో ఉన్న ఫోటోను  షేర్ చేశాడని, సదరు అమ్మాయి తన ప్రియురాలు అని పెట్టారని, ఆ అమ్మాయి కుటుంబసభ్యులైన ఎన్.వినంజీ, ఎన్. శాంత, ఎన్. జల, మరో మైనర్ ఆగ్రహానికి గురై ఈ నెల 27న ఎదురుగట్ల సతీష్ పై కర్రలతో దాడి చేశారని, ఈ దాడిలో ఎదురుగట్ల సతీష్ అక్కడికక్కడే మృతి చెందగా, నిందితులు అక్కడి నుండి పారిపోయారని తెలిపారు. మృతుని తండ్రి ఎదురుగట్ల రాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సోమవారం నిందితులను పట్టుకున్నామని తెలిపారు. నిందితుల వద్ద నుండి హత్యకు వినియోగించిన కర్రలు, దుస్తులు, ఓ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు. 
హత్య కేసును త్వరగా చేధించి నిందితులను పట్టుకున్న  జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్  ఎస్ఐ గీత, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్  ఎస్ఐ గీత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250929-WA0028

Tags: