జగిత్యాల లో మరో క్రిప్టో కేసు నమోదు,85లక్షలు మోసపోయిన బాధితుడు
జగిత్యాలలో మరో క్రిప్టో కేసు నమోదు..
పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న క్రిప్టో బాధితులు.
జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 12 క్రిప్టో వ్యాపారంలో పెట్టుబడి పెడితే
మూడింతల ఆదాయం వస్తుందని ఓ ఆన్ లైన్ యాప్ లో పెట్టుబడి పెట్టించిన జగిత్యాల పట్టణానికి చెందిన కస్తూరి రాకేశ్ పై జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. జగిత్యాల పట్టణానికి చెందిన ఫజిల్ అహ్మద్ ను కస్తూరి రాకేష్ నమ్మించి రూ.85 లక్షలు మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెల్సింది.. అయితే కొడిమ్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కస్తూరి రాకేశ్ ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. తాజాగా జగిత్యాల పట్టణంలోని మరో కేసు నమోదుకాగా జిల్లాలో ఇంకా చాలామంది బాధితులు ఒక్కొక్కరు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తుంది. కస్తూరి రాకేష్ సోదరుడిని శనివారం డబ్బులు గురించి నిలదీయడంతో, బిట్స్ కాయిన్ లో కీలకం గా ఉన్నా లోకేష్ తో ఫోన్ లో అడుగగా తాము డబ్బులు ఇవ్వమని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటి వరకు చిన్నగా నష్టపోయిన బాధితులు ఫిర్యాదులు చేయగా పెద్ద మొత్తం లో 85 లక్షలు మోసపోయిన బాధితుని ఫిర్యాదు రావడం ఇది మొదటిది.