ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం
ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం........
బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను వినియోగించుకోవాలి
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్
జగిత్యాల సెప్టెంబర్ 21
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను అవగాహనా చేసుకొని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి అని
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు, చురుకలు ఏడిటర్, ఆంధ్రప్రభ జిల్లా బ్యూరో మహమ్మద్ ఇమ్రాన్ అన్నారు. ఆదివారం
జిల్లాలో కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కార్యవర్గసభ్యుడు, డిక్కి జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఇమ్రాన్ పాల్గొని
డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలతో ఘన నివాళ్లు అర్పించి మహానుభావుని సేవలను స్మరించారు. ఈ సందర్బంగా
డిక్కీ కోఆర్డినేటర్ నల్ల శ్యామ్ మాట్లాడుతూడాక్టర్ బి ఆర్
అంబేద్కర్ దేశానికి అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలి అని ప్రతి ఆదివారం అంబేత్కర్ స్మరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ అన్నారు..అంబేద్కర్ రాజ్యాంగం రాయకుంటే పీడిత వర్గాలు అన్ని అడవుల్లో పశువుల కాపరులుగా మిగిలిపోయేవారని అన్నారు. ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించాగానే ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్ళుటకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. అనంతరం
ముఖ్య అతిథి ఎం డి ఇమ్రాన్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కల్పించిన హక్కులను సాధించుకొనుటకు ప్రతి ఒక్కరు అవగాహనా కలిగి ఉండాలన్నారు. అవగాహణతో పోరాడి హక్కులను సాధించుకోవాలన్నారు. ప్రతి ఆదివారం రాజ్యాంగ నిర్మాత మహా మేధావి కార్యక్రామ్మన్ని నిర్వాహకులు డిక్కీ కోఆర్డినేటర్ నల్ల శ్యాంకి అభినందనలు తెలిపారు. కార్యక్రమం లో భాగంగా
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేనేని రవీందర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం యువత చెడు మార్గంలో ప్రయాణిస్తూ విలువలు, ఆశయలు లేకుండా జీవితం కొనసాగించడం ఆందోళన కలిగించే అంశామన్నారు. ప్రతి ఆదివారం కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వీరమంగా కొనసాగుతున్న అంబేద్కర్ స్మరణం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయులను కీర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరు గొప్ప ఆశయంతో ముందుకు నడవాలి అని అన్నారు.
అనంతరం టి డబ్ల్యు జె ఎఫ్ ఆర్గనైసింగ్ సెక్రటరీ
ఆముదం లింగారెడ్డి, మాట్లాడుతూ భారత సమాజంలో సామాజిక వివక్షత, మహిళా వివక్షత అనేక వివక్షతలు క్రోడికరించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మంచి రాజ్యాంగం అందించారని అన్నారు. అంబేద్కర్ మహనీయుని సేవలు ప్రతి ఆదివారం స్మరించుకోవడం గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ద్యావర సంజీవరాజు, రేణిగుంట శ్రీనివాస్, సహాయ కార్యదర్శి, తెలంగాణ శక్తి ఎడిటర్ ఆనంతుల కాంతారావు మట్టిపూలు ఎడిటర్ తక్కళ్ల దేవయ్య , విజన్ ఆంధ్ర జిల్లా స్థాపర్ మర్రిపల్లి శ్రీనివాస్, ప్రజా తెలంగాణ టీవీ సీఈవో, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అజామ్, డిస్టిక్ బ్యూరో హకీమ్, స్టూడెంట్ అకాడమీ, రిపోర్టర్ ఖలీల్ ఉద్దీన్, మొహమ్మద్ షాహిద్ అలీ,ఎండీ అబ్దుల్లా, ఎండీ నయీమ్, బరిసే కళావేదిక జిల్లా అధ్యక్షులు పులి గోవర్ధన్, రిటైర్డ్ ఎంఈఓ మద్దెల నారాయణ,జిల్లా ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాయితి శ్రీనివాస్, ,కంటె అంజయ్య, ,నల్ల సురేష్, చెనల్ల సుమన్, బొట్ల విజయ్, రతన్, సంకె మహేష్, దాసండ్ల కమలాకర్,లక్కం సురేష్, దుమాల గంగాధర్, కండ్లే హన్మంతు, తదితర అంబేద్కర్ వాదులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.