బీర్పూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బీర్ పూర్ గ్రామ పూర్వ విద్యార్థుల సమ్మేళనం...
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటున్న పూర్వ విద్యార్ధులు..
చురకలు విలేకరి. బీర్ పూర్ మే 11:
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం లోని. జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల లోనీ పూర్వ విద్యార్థులు తమ చిన్నప్పుడు కలిసిమెలిసి చదువుకున్న పాఠశాలలో కలుసుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు.పూర్వ విద్యార్థులు బీర్పూర్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 2008- 2009 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి మిత్ర బృందం.చిన్ననాటి స్నేహితుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆటపాటలతో ఆనందోత్సాహాలతో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా నిర్వహించుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మొట్టమొదటగా సరస్వతి పూజతో ప్రారంభించి చిన్నప్పటికి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ప్రారంభించారు.
గతంలో వారు చదువుకున్న పాఠశాలలో వారికి విద్యా బోధన అందించిన ఉపాధ్యాయులతో కలుసుకొని విద్యార్థి దశలో ఉన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
ప్రస్తుతం వారందరూ వివిధ రంగాలలో స్థిరపడగా, వారికి విద్యా బోధనలు అందించిన ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ వారిని సన్మానించారు. సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ స్నేహమేర జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ చిన్ననాటి చిలిపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు ప్రేమతో పలకరించుకుంటూ గత స్మృతులతో మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ గత జ్ఞపకాలను నెమరు వేసుకున్నారు. చిన్ననాటి ఆటపాటలు చిలిపి పనులు ఆనాటి ఆనందం ఎప్పుడు జీవితంలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయని తెలిపారు. తమ తోటి మిత్రులు ఎవరెవరు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని వారి జీవితంలో జరుగుతున్న అనుభవాలను ఒకరికొకరు ప్రేమతో పంచుకుంటూ చిన్ననాటి మిత్రులందరికీ ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలని అందరం ఇలా కలుసుకోవడం మరుపురాని జ్ఞాపకం అని జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆనందాలలో ఈరోజు జరుపుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని తెలిపారు. చిన్ననాడు తమకు విద్య బోధనలో నేర్పించిన గురువులకు తమ ఈ స్థాయిలో నిలబడటానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్లీ అవకాశం ఉంటే ఇలాంటి ఆనందకరమైన కలయికతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుందామని చెప్పుకున్నారు.