ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే గాయత్రి బ్యాంక్ లక్ష్యం
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే గాయత్రి బ్యాంక్ లక్ష్యం.
గాయత్రి బ్యాంక్ సీఈఓ వనమాల శ్రీనివాస్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 11: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే గాయత్రి బ్యాంక్ లక్ష్యమని గాయత్రి బ్యాంక్ సీఈఓ వనమాల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా విస్తరిస్తున్న గాయత్రి బ్యాంకు సేవలు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 63 వ శాఖను ఆదిలాబాద్ మాజీ జెడ్పి.వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నూర్ మాజీ జడ్పిటిసి బి. కరుణాసాగర్ రావు, చెన్నూర్ మున్సిపాలిటి మాజీ మున్సిపల్ చైర్మన్ అర్చన రాంలాల్ గిల్డా, బి.జె.పి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, ఎక్సైజ్ కాంట్రాక్టర్ కొరకొప్పుల నర్సగౌడ్, సీనియర్ వ్యాపార వేత్త హీరాలాల్ , సీనియర్ వ్యాపార వేత్త తారాచంద్ దెవ గారు, బ్యాంకు పాలక వర్గ సభ్యులు, పుర ప్రముఖలు, సహకార అధికారులు, బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆదిలాబాద్ మాజీ జెడ్పి వైస్ చైర్మన్ మూల రాజరెడ్డి మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా 2000 సంవత్సరంలో యూనిట్ బ్యాంకుగా ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు వినియోగదారులకు పారదర్శక సత్వర సేవలందించాలనే ఉద్యేశంతో కృషిచేస్తూ, నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ.3204.48 కోట్ల వ్యాపారాన్ని సాధించి 8,05,324 వినియోగదారులతో తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో మొదటి స్థానముకు చేరుకున్నామన్నారు. అనంతరం చెన్నూర్ మాజీ జడ్పిటిసి బి.కరుణాసాగర్ రావు మాట్లాడుతూ, బ్యాంకు యందు. మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ. ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటుచేయడం, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండడం, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందించడం వంటి చాలా సేవలు వినూత్నంగా ఉన్నాయని వినియోగదారులు తప్పక ఆదరిస్తారన్నారు.
అనంతరం చెన్నూర్ మున్సిపాలిటి మాజీ మున్సిపల్ చైర్మన్ అర్చన రాంలాల్ గిల్దా మాట్లాడుతూ గాయత్రి నిర్బయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నారని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఇట్టి సేవలను చెన్నూర్ వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అనంతరం బి.జె.పి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేవలం 550 రూపాయలకే సేవింగ్ ఖాతాను ప్రారంబిస్తారని, రైతులు, మహిళలు అందరూ కూడా సేవింగ్ ఖాతాలను ప్రారంబించి ఆర్ధిక లావాదేవీలను యుపిఐ (ఫోన్పే, గూగుల్ పే) ద్వారా నిర్వహించడం చాలా సులువుగా ఉంటుందని, గాయత్రి బ్యాంకు చెన్నూర్ శాఖను ఆదరించాలని కోరారు. అనంతరం ఎక్సైజ్ కాంట్రాక్టర్ కోరకొప్పుల సర్సగౌడ్ మాట్లాడుతూ బ్యాంకు యందు ఎటువంటి హిడెన్ చార్జీలు లేకుండా పేద మద్య తరగతి వినియోగదారుల శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని అన్ని రకాల రుణాలను అందిస్తున్నారని సత్వర సేవలకు మారుపేరుగా ఉందన్నారు.అనంతరం బ్యాంకు రీజనల్ హెడ్ సి. హెచ్. వంశీకృష్ణ మాట్లాడుతూ వినియోగదారులకు ఉ.10 గంటల నుండి సా.7-00 గంటల వరకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయని, కరెంటు ఖాతా కేవలం 1000 బ్యాలన్సుతో వెంటనే ప్రారంభిస్తామని చెన్నూరు ప్రజలందరూ బ్యాంకు సేవలను వినియోగించుకొని, అదరించాలని కోరారు. అనంతరం బ్రాంచి హెడ్ పులిశెట్టి రమేశ్ మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని, రైతులకు, వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, సేవింగ్, కరెంటు ఖాతాలను వెంటనే ప్రారంభిస్తామని వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఋణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవని, డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలకవర్గ సభ్యులైన ముత్యాల లక్ష్మణ్ రెడ్డి, ఎమ్. సౌజన్య, ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి.మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్ గార్లు, మరియు ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.