జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన కారు... వ్య క్తితో పాటు చిన్నారి మృతి.
By: Mohammad Imran
On

జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.
బైక్ ను ఢీకొట్టిన కారు... వ్య క్తితో పాటు చిన్నారి మృతి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 13 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్వడలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని హనుమాన్ వాడ కు చెందిన పాదం మల్లేశం అతని సోదరుడు శేఖర్ కూతురు వితన్వికి(18 నెలలు) చాకెట్లు కొనివ్వడానికి తమ ఇంటి నుండి దుకాణానికి పల్సర్ బైక్ బయలుదేరగా అతివేగంగా వచ్చిన కారు బైకన్ను ఢీకొట్టడంతో
వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, పట్టణ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ లు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. మల్లేశం, వితన్వి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
Tags: