జగిత్యాలలో మామిడి వ్యాపారుల ధర్నా... కామన్ ఆక్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్.. భారీగా నిలిచిన వాహనాలు...
జగిత్యాలలో మామిడి వ్యాపారుల ధర్నా...
కామన్ ఆక్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని డిమాండ్..
భారీగా నిలిచిన వాహనాలు...
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మే 13 : జగిత్యాల మామిడి మార్కెట్ లో కామన్ యాక్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం రాత్రి మామిడి వ్యాపారులు మార్కెట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మామిడి వ్యాపారుల ధర్నాతో జాతీయ రహదారిపై గంటకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. మామిడి వ్యాపారులు మాట్లాడుతూ జగిత్యాల మామిడి మార్కెట్ లో అధికారులు కొందరు వ్యాపారులకు వత్తాసు పలుకుతూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. మామిడి సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి మార్కెట్ లో కామన్ ఆక్షన్ పాయింట్ ను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్ లో కొందరు వ్యాపారులు మాత్రమే తమకు నచ్చినట్లు వేలంపాట పడుతూ రైతులను మోసం చేస్తున్నారు. దీంతో అటు రైతులు, ఇటు వ్యాపారులు నష్టపోతున్నారని, ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు స్పందించక పోవడంతో తాము ఆందోళన చేపట్టామన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మార్కెట్ లో కామన్ ఆక్షన్ పాయింట్ ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో తాము లైసెన్స్ లు సరెండర్ చేస్తామన్నారు.