ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 31 మంది మావోయిస్టులు మృతి -

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 31 మంది మావోయిస్టులు మృతి -

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌- 31 మంది మావోయిస్టులు మృతి -

బీజపూర్, 

 ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మరో భారీ ఎన్​కౌంటర్​లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలోనే ఇద్దురు సైనికులు ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. మావోయిస్టుల కోసం డీఆర్‌జీ, ఎస్​టీఎఫ్‌, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

ఉన్నట్లు సమాచారం.

సంఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 ,ఎస్ఎల్ఆర్ ,లాంచర్ పలు ఆధునాతన ఆయుధాలు
స్వాధీనం చేసుకున్నారు తెలంగాణకు చెందిన ముఖ్య నాయకులు చనిపోయినట్టు వార్తలందుతున్నాయి

పశ్చిమ బస్తర్‌ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో బీజాపుర్ జిల్లాలోని ఇంద్రావతీ నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై బస్తర్‌ ఐజీ పి.సుందర్‌రాజు స్పందించారు .భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధ్రువీకరించారు.

ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలోనే రెండో భారీ ఎన్‌కౌంటర్‌గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని జనవరి 6న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి.Screenshot_20250209_164614_Chrome~2

Tags:

Related Posts