కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దు. రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మెరుగైన ప్రణాళికతో కొండగట్టును అభివృద్ధి చేయాలి. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దు.
రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి.
మెరుగైన ప్రణాళికతో కొండగట్టును అభివృద్ధి చేయాలి.
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 9 : బిఆర్ఎస్ హాయంలో మొదలుపెట్టిన కొండగట్టు ఆలయ అభివృద్ధిని ఆపవద్దని, మెరుగైన ప్రణాళికతో కొండగట్టును అభివృద్ధి చేయాలని, రాజకీయాలకు అతీతంగా ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా బేతాళస్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయస్వామివారిని
దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ కవితకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి ఆశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రూ.1000 కోట్లతో మాజీ సీఎం కేసిఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రణాళిక వేశారని, అదే ప్రణాళికతో లేకపోతే మరింత మెరుగైన ప్రణాళికతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి పనులను చేపట్టాలన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే కొండగట్టు అంజన్న క్షేత్రంపై
ప్రభుత్వం దృష్టి సారించి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలన్నారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి పనులను ఆపవద్దని, బిఆర్ఎస్ హాయంలో మొదలు పెట్టిన పనులను
కొనసాగించాలన్నారు. కొండగట్టును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, రూ.25 కోట్లతో కొండపై నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని గుర్తు చేశారు. దేవుడి భూములను కాపాడటానికి ప్రణాళిక రూపొందించామన్నారు. నిత్యం వేలాది భక్తులతో కిటకిటలాడే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జడ్పిటిసిలు కొండపల్కల రామ్మెహన్ రావు, పునుగోటి ప్రశాంతి కృష్ణారావు, నాయకులు అయిల్నేని సాగర్రావు, సమీండ్ల శ్రీనివాస్, పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి , ఆనందావు,
జనగాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.