రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ తుది దశకు ఎంపికైన అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులు
రామానుజన్ మ్యాథ్స్ ఒలింపియాడ్ తుది దశకు ఎంపికైన అల్ఫోర్స్ ఇ-టెక్నో విద్యార్థులు
చురకలు విలేఖరి
కరీంనగర్, అక్టోబర్,30
విద్యార్థులకు గణితం చాలా కీలకమని మరియు వారికి పలు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికై ఉపకరిస్తుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు రామానుజన్ మ్యాథ్స్ ఒలంపియాడ్ తుది దశకు అర్హత సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణిత శాస్త్రంలో అనేక విషయాలను ఉన్నాయని మరియు ఆ విషయాలను సులభంగా నేర్చుగోగల్గుతామని అభిప్రాయపడుతూ ప్రతి ఒక్కరు అందులో తెలుపబడిన నిభందనలను పాటించి సాధన చేసి ముందంజలో ఉండడమే కాకుండా ఘనవిజయాలను వైపు పయనించాలని వారు ఆకాక్షించారు.
పాఠశాల స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులను వివిధ స్థాయిలలో మరియు సంస్థల వారు నిర్వహిస్తున్న పలు పోటీ పరిక్షలకు ఎంపికచేయడం జరుగుతుందని అభిప్రాయపడుతు ప్రతిఒక్కరు అన్ని విధాలుగా అంశాలను సాధన చేసి పట్టు సాధించి ఆదర్శంగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో ప్రముఖ పోటీపరీక్షల సంస్థ రామానుజన్ మ్యాథ్స్ ఆకాడమి వారు నిర్వహించినటువంటి రాష్ట్ర స్థాయి ఒలంపియాడ్ ప్రధమ దశలో పాఠశాలకు చెందిన ఎ.శ్రీయాన్ రెడ్డి, జె. సిద్ధార్ద్, 3వ తరగతి, టి.మనోజ, బి.విహార్, 4వ తరగతి, కె.హావిష్ రెడ్డి, జి.జోయల్ డేవిన్, 5వ తరగతి, జి.సహాన్స్, టి.సాయి దీక్షిత్, 6వ తరగతి, ఎన్. సహార్ష్, సిహెచ్. శ్రీజన్ రెడ్డి, 7వ తరగతి, జి.సాయిసంహిత్, జె.ప్రణవ్ కుమార్, 8వ తరగతి, వి.వర్దిని, వి.అభిరామ్ 9వ తరగతి మరియు తదితరులు అర్హత సాధించారని చెప్పారు.
చాలా పెద్ద సంఖ్యలో అర్హత సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పాటు ప్రశంస పత్రాలను అందజేసి త్వరలో నిర్వహించబోయే తుదిదశలో ఘనవిజయాలను సాధించాలని ఆకాక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.