ఎమ్మేల్యే పై తప్పుడు ఆలోచనలు మానుకోవాలి

ఎమ్మేల్యే పై తప్పుడు ఆలోచనలు మానుకోవాలి

*ఎమ్మెల్యే పై టిఆర్ఎస్ నాయకుల తప్పుడు ఆలోచనలు మానుకోవాలి*

చురకలు విలేఖరి (జాప నాగరాజు)IMG-20241029-WA0005
తిమ్మాపూర్ అక్టోబర్ 29                                                                                                                                                 

జన్వాడ ఫాంపౌజ్ లో జరిగిన దివాళీ దావత్ లో డ్రగ్స్ వాడినట్టుగా నమోదైన కేసులో పరారీలో ఉన్న ఆ ఫాంహౌజ్ యజమానికి రాజ్ పాకాలతో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు సంబంధాలున్నాయని కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు ఆరోపించారు. డీసీసీ కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ డైరెక్టర్ అలువాల కోటి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుల వెంకటి, ఎస్సీ సెల్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రెడ్డిగాని రాజు  మంగళవారం ఎల్.ఎం.డీ కాలనీలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్ పాకాలతో రసమయి బాలకిషన్ కు బలమైన సంబంధాలు న్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాజ్ పాకాల ఇంట్లో రసమయి ఫొటోలు ఉండటం అనుమానాలకు తావిస్తోందన్నారు.ఈ వ్యవహారంలో రసమయి పాత్ర తేలాల్సి ఉందన్నారు. పార్టీలో కొకైన్ మద్దూరి విజయ్ కొకైన్ వాడినట్టుగా పరీక్షల్లో తేలడమే కాకుండా స్వయంగా ఆయనే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నందున జన్వాడ ఫాంహౌజ్ లో జరిగింది మందు పార్టీ కాదని, డ్రగ్ పార్టీ అని వారు పేర్కొన్నారు. గులాబీ నేతులు డ్రగ్ పార్టీని మందు పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మానకొండ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కనుకం అశోక్, మచ్చ రాజేశం, కొంకటి రాములు, నాయకులు చలిగంటి సంపత్, జీడీ శ్యామ్, కోండ్ర సురేష్, అలువాల కుమార్, శంకర్, మాతంగి సంతీష్, ఎస్.అనిల్, మానాల రవి ఎస్.శ్రీనివాస్, జే.మధు.శ్రీనివాస్, ఎల్.శ్రీనివాస్,కె.రాములు,ఎం ప్రభాకర్,రాసూరి మల్లికార్జున్, సిరిసిల్ల రాజు, యు.నరేష్. హాసన్, ఎల్ మల్లయ్య టి.జంపన్న జి.రాజమల్లు, జి.చిట్టిబాబు,కనకం కుమార్,ఎస్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts