పోషించని కొడుకుపై ఆర్డీఓ కు ఫిర్యాదు

పోషించని కొడుకుపై ఆర్డీఓ కు ఫిర్యాదు

పోషించని కొడుకుపై ఆర్డీవోకు  తండ్రి  ఫిర్యాదు.

        జగిత్యాల అక్టోబర్ 29:

IMG-20241028-WA0012పోషించక,వేధింపులకు గురిచేస్తున్న కొడుకు,కోడలు పై మల్యాల మండలం రామన్నపేట కు చెందిన పంజాల దుంపేటి( 66) అనే వృద్ధ తండ్రి ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు.అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ను కలిసి తన గోడు వెళ్ళబోసుకున్నాడు. సోమవారం  ఈ సందర్భంగా ఆ తండ్రి ,సీనియర్ సిటీజేన్స్ అధ్యక్షుడితో కలిసి విలేకరులతో మాట్లాడారు.తన కుమారుడు పంజాల లక్ష్మణ్ ,కోడలు కవిత  నిరదరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నా భార్య లస్మవ్వ ను సైతం నా కొడుకు వేధింపులకు మానసిక క్షోభతో 3 ఏళ్ల కింద మరణించినట్లు చెబుతూ విలపించాడు.పెద్ద మనుషులు నా పోషణ నిమిత్తం ప్రతి 6 నెలలకు రూ.50 వేలు ఇవ్వాలని  తీర్మానం చేసినా కొడుకు ఇవ్వకుండా నా స్వార్జిత రెండు గుంటలు భూమిని, కల్లు దుకాణం రూ.17 లక్షలకు అమ్ముకున్నాడని అట్టి డబ్బులు కూడా నాకు ఏమీ ఇవ్వలేదని,ఇంకా నాకున్న పొలం ఒక ఎకరం ను సైతం నా పోషణ ఖర్చుల కోసం అమ్ముకుండామని ప్రయత్నిస్తే అడ్డు పడుతున్నాడని,నా స్వార్జిత ఇంటిలోనే నా కొడుకు,కోడలు నివసిస్తు,నన్ను పోషించకుండా  కొట్టుతూ నానా వేధింపులకు గురిచేస్తున్న నా కొడుకు కోడలుతో ప్రాణ భయం ఉందని ,వారిని నా ఇంటిలో నుంచి వెళ్లగొట్టి ,నాకు పోషణ,వైద్య ఖర్చులు నా కొడుకు తో ఇప్పించాలని తగు చర్యలు నా కొడుకు,కోడలుపై తగు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో ను వెదుకున్నామన్నాడు. ఈ విషయం  ఆర్డీవో కేసు నమోదు చేశారని,సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తనకు సాయం అందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.తండ్రి పంజాల దుంపేటి వెంట సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్,ఆ సంఘ ప్రతినిధులు ప్రకాష్ రావు,విష్వనాథం,సతీష్ రాజ్,ఎం.డి.యాకూబ్ తదితరులు  పాల్గొన్నారు.

Tags:

Related Posts