ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నీ అధిష్టానం గౌరవిస్తుంది వీప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
*ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అధిష్టాన0 గౌరవిస్తుంది*
*జీవన్ రెడ్డి ఆశీర్వాదంతోనే ఎదిగాను..*
*ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్*
జగిత్యాల ;
కాంగ్రెసు సీనియర్ నాయకులు ,ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలుగకుండా అధిష్టానం గుర్తిస్తుందని, ఆయనకు కష్ట కాలంలో మనం అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇటీవల హత్యకు గురైన
కాంగ్రెసు నాయకుడు మారు గంగారెడ్డి సంతపసభ మంగళవారం జగిత్యాలలో నిర్వహించగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనగా లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో10 ఏండ్లు రాచరిక పాలన సాగించారని విమర్శించారు.
కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టిన భరించమని తెలపారు.కొత్తగా చేరివారికి కాకుండా
పాత కార్యకర్తలకు గుర్తింపును ఇచ్చేవిధంగా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించేవిధంగా సీఎం, పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకుపోతానని లక్ష్మణ్ కుమార్ స్పష్టంచేశారు.
జీవన్ రెడ్డి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్నారని ,మారు గంగారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు చనిపోతే ఎమ్మెల్సీ కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్టు భాధపడ్డారని అటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు.
గంగారెడ్డి హత్య పట్ల జీవన్ రెడ్డి బాధతో ఉన్నారని
ఆయన బాధను అధిష్టానం అర్థం చేసుకుందని ,తగిన గుర్తింపు ఇస్తుందన్నారు.
మాములు కార్యకర్తలు గా ఉన్న నేను, చొప్పదండీ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లను జీవన్ రెడ్డి ఈ స్థాయిలో నిలిపారని కొనియాడారు. అధిష్టానంతో కోట్లాడి మాకు టిక్కెట్లు ఇప్పించారని చెబుతూ జీవన్ రెడ్డి ఆశీర్వాదంతో మేము ఇంత ఉన్నతపదవిలో ఉన్నామని ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కార్యకర్తల కోసం పరితపించే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదు రాష్ట్రంలోని లక్షలాది మంది కాంగ్రెసు కార్యకర్తలు అండగా ఉన్నారని పేర్కొన్నారు.1996ఉప ఎన్నికల్లో అప్పటి సీఎం చంద్రబాబు జీవన్ రెడ్డి ని ఓడించాలని ఎన్నికుట్రలు పన్నిన ఓటర్లు నాయకుడిని చూసి జీవన్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. జగిత్యాల కాంగ్రెసు కు కంచుకోట అంటూ జీవన్ రెడ్డి మనకు నాయకుడు కావడం అదృష్టమని చెప్పారు. నేను ఎమ్మెల్యే అయ్యానంటే అది జీవన్ రెడ్డి చలవే నని ,అధిష్టాన0తో కొట్లాడి టిక్కెట ఇప్పించి గెలిపించారని పేర్కొన్నారు.
జీవన్ రెడ్డి కి గౌరవప్రదమైన పదవి వస్తుందని, వచ్చే వరకు మనం నిద్రపోవద్దని సత్యం కార్యకర్తను కోరారు. కార్యక్రమంలో నాయకులు కొత్తమోహన్,బండ శంకర్, విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, శోభారాణి, అనిత, నందయ్య,కొండ్ర రాం చంద్రారెడ్డి,ఎల్లారెడ్డి, జితేందర్, జున్ను రాజేందర్, దుర్గయ్య, నక్క జీవన్, వేముల సుభాష్, మన్సూర్, రాంచంద్రారెడ్డి, మునిందర్ రెడ్డి, గంగాధర్, గోళ్ల తిరుపతి, చిట్ల లత, తదితరులు పాల్గొన్నారు.
-----------------/
*గంగారెడ్డి హత్యపై పోలీసులు లోతుగా విచారించాలి ; విప్ లక్ష్మణ్ కుమార్*
కాంగ్రెసు నాయకుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్య విషయంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీ కి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
హత్య విషయంలో తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ చేసి నిందితుడిని రిమాండు కు పంపిస్తే
సరిపోదని హత్య వెనుక ఎవరున్నారో కనిపెట్టాలన్నారు.
నిందితుడు వాడిన కారు, కారులో ఎవరెవరు వచ్చారనే దానిపై విచారణ చేపట్టాలని పోలీసులను విప్ ఆదేశించారు.
,హత్య వెనుక ఎంతటి వారున్న వదిలిపెట్టొద్న్నారు ,కార్యకర్తలు అధైర్యపడొద్దని లక్ష్మణ్ కుమార్ సూచించారు.