వైన్స్ నిర్వాహకులపై ప్రజా వాణి లో ఫిర్యాదు

వైన్స్ నిర్వాహకులపై ప్రజా వాణి లో ఫిర్యాదు

వైన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వినతి.

చురకలు విలేకరి, జగిత్యాల, అక్టోబర్ 28:  జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఓ వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వీడీసీ సభ్యులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపులకు రూ. 10 నుంచి 40 వరకు అధిక ధరలకు మద్యం విక్రయించడం తో బెల్ట్ షాపుల వాళ్లు రూ.20 నుంచి 80 వరకు వినియోగదారుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారంటూ తెలిపారు. అసలు బెల్ట్ షాపులే నిర్వహించకూడదని నిబంధనలుంటే వాస్తవానికి బెల్ట్ షాపులకు హోల్ సేల్ గా ఎమ్ఆర్పీ(ఎంఆర్పీ) కంటే తక్కువ ధరలకే విక్రయించాలంటూ ఫిర్యాదులో రాసుకొచ్చారు. మండలంలో ఉన్న 11 గ్రామాల్లో అనధికారికంగా ఉన్న ఈ బెల్ట్ షాపులకు ప్రత్యేకంగా స్టిక్కర్లు వేసిన మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ తెలిపారు. అంతేకాకుండా మరో చోటు నుండి మద్యం తీసుకొచ్చి అమ్ముతున్నారనే అనుమానం తో వైన్స్ సిబ్బంది బెల్ట్ షాపులపై తనిఖీలు సైతం చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు కల్తీ మద్యం కూడా అమ్ముతున్నారని నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను కోరారు.
బుగ్గారం కు చెందిన విడిసి నాయకుల ఫిర్యాదు గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న బెల్ట్ షాపుల తీరుకు అద్దం పడుతుంది. మండలంలోని గ్రామాల్లో పదుల సంఖ్యలో బెల్టు షాపులు ఉన్నట్లుగా ఫిర్యాదులో వివరించారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో వీధికో బెల్ట్ షాప్ అన్నట్లుగా పరిస్థితి తయారైందనేది బహిరంగ రహస్యమే. ఆయా ప్రాంతాల్లో ఉన్న వైన్స్ యజమానులే సేల్స్ పెంచుకోవడానికి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్న ట్లు తెలుస్తుంది. వైన్స్ లను మానిటరింగ్ చేస్తూ కల్తీ మద్యాన్ని అడ్డుకోవడంతో పాటు బెల్ట్ షాపులను నియంత్రించడంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు విఫలం అయ్యారని విమర్శలను మూటగట్టుకుంటున్నారు. తాజాగా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో బెల్ట్ షాపులతో పాటు కల్తీ మద్యం పట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైన్స్ నిర్వాహకులపై ఎక్సైజ్ ఆఫీసర్లు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది.IMG-20241028-WA0011

Tags:

Related Posts