బోగస్ కంపెనీల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తోసుకోవాలి, వెల్గొండ పద్మ ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి

బోగస్  కంపెనీల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తోసుకోవాలి,  వెల్గొండ పద్మ  ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి

మహిళల ఆర్థికతను దెబ్బతిస్తున్న రుద్ర, స్పాట్ లోన్ లాంటి బోగస్ డిజిటల్ 
కంపెనీల పై ప్రభుత్వం వెంటనే చర్యలు తోసుకోవాలి,

ప్రభుత్వం మహిళల్ని నిర్లక్ష్యం చేస్తోంది. 

వెల్గొండ పద్మ 
ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి 


చురకలు విలేఖరి 
జగిత్యాల అక్టోబర్,30

ప్రభుత్వం మహిళల్ని నిర్లక్ష్యం చేస్తోంది. వృత్తి,ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పించక పోగా ఆర్థిక 
ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఓ వైపు ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఉంటే మరో వైపు కూరగాయలు ధరలు, నిత్యావరాలు పెరిగి ఈ భారం మహిళల పై తీవ్ర ప్రభావం చూపుతుంది.కొన్ని కుటుంబాలు అప్పుల పాలు అయి ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. ఎట్టకేలకు మహిళలకే ముప్పు వాటిల్లుతోంది.

దీనికి తోడు కొన్ని మోసపురితమైన కంపెనీలు 
డిజిటల్ కంపెనీలా పేరు మహిళలకు ఎరవేస్తున్నాయి.
ఇలాంటి వాటి మోసపురిత మైన కుట్ర లో చిక్కుకుని చాలా మంది మహిళలు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, తన తల్లితండ్రికి, లేదా భర్త కీ పిల్లలకీ చేదోడు వాడోడుగా ఉండాలని ఈ లాంటి మోసపురితమైన డిజిటల్ సంస్థల వరలో చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కుటుంబాలు ఆన్లైన్ గేమ్స్ లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఆత్మ హత్య చేసుకున్నాయి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ప్రభుత్వాలు చూసి చూడనట్టు, విని విని వినినట్టు, ప్రభుత్వానికి అవసరం లేనట్టు గా మహిళల పట్ల నిర్లక్ష్య ధోరణి ఎంతగానో కనిపిస్తుంది.

నేడు డిజిటల్ ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మోసపురితమైన కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి మహిళలకు ఎర వేసి 
ఆర్థిక ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. మన జిల్లా, రాష్ట్రము, దేశంలో నే అత్యధిక సంఖ్యలో మహిళలు నష్టపోతున్నారు.

సామజిక,శాస్త్ర, సాంకేతిక,విద్యా,వైద్య,న్యాయ, రంగాల్లో మహిళలు ముందున్నారు.మన దేశం లో మన ఆకలిని తీర్చే రైతు "మన దేశానికే రైతు వెన్నెముక" అయితే మన దేశం అభివృద్ధి చెందాలంటే కూడా మహిళలు మన దేశానికే వెన్నెముక లాంటి వారు మహిళా తన శక్తి,సామర్థ్యం,తన ఉనికిని తెలుసుకోవాలి చైతన్యం కావాలి,

మహిళలు ఇంటికే పరిమితం కావటం వల్ల కూడా ఇలాంటి మోసపురిత ఆదాయ వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు.
పుట్టగొడుల్లా పుట్టుకోస్తున్న ఇలా మోసపురిత సంస్థల ప్రలోభాలకు లొంగి వారి ఆర్థికతను నష్టపోతున్నారు. అందుబాటులో ఉన్న వివిధ కంపెనీల్లో చిన్న పాటి జీతం సరిపోక పెరుగుతున్న నిత్యావసర ధరలు, కూరగాయల ధరలు సామాన్యుల పై మోయలేని భారాన్ని పెడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెక్కాడితే డొక్కాడని సామాన్య మహిళలు  నిత్యావసర సరుకులు కొనలేక మహిళలకు ముప్పు వాటిల్లుతోంది.ఈ సమస్యలు ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని అఖిల భారత ప్రజా తంత్ర మహిళా సంఘం జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  వెల్గొండ పద్మ జగిత్యాల జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదిIMG-20241030-WA0000

Tags:

Related Posts