వంగ మహేందర్ రెడ్డినీ గెలిపించండి

వంగ మహేందర్ రెడ్డినీ గెలిపించండి

*వంగ మహేందర్ రెడ్డిని గెలిపించండి*

 *అంకిత భావంతో పని చేయండి* 

*నూతన ఉపాధ్యాయుల సమ్మేళనం*

*పీఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి*

చురకలు విలేఖరి 
జగిత్యాల 

పిఆర్టీయు టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనంద్ రావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ల ఆధ్వర్యంలో  పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో డిఎస్సి 2024 నూతన ఉపాధ్యాయుల సమ్మేళనం విద్యా సదస్సును ఘనంగా నిర్వహించారు., 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచేసిన పీఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి  మాట్లాడుతూ అంకితభావం తో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలల మనుగడ కు కృషి చేయాలని నూతన ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను మేధావుల తీర్చి దిద్దాలని అన్నారు., ఉపాధ్యాయుల ఎన్నో సమస్యలను పీఆర్టీయు సంఘం పరిష్కరించిందని గుర్తుచేశారు .భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, పాఠశాలల అభివృద్ధికి పీఆర్టీయు అధికార ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు తో గెలిపించాలని ఉపాధ్యాయులను,సభ్యులను కోరారు.కేజిబివి లో పని చేసే మహిళా ఉపాధ్యాయులకు క్యాజ్వేల్ సెలవులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్య రంగంలో ఉన్న జీవోల పట్ల, సర్వీస్ సంబందించిన విషయాలను పుట్ట శ్రీనివాస్ రెడ్డి నూతన ఉపాధ్యాయులకు అవగహన కల్పించారు. పిఆర్టీయు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన 290 మంది నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయినిపెల్లి ఆనంద్ రావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి, సిద్దిపేట అధ్యక్షులు ఇంద్రాసేన రెడ్డి, రాష్ట్ర సొసైటీ అధ్యక్షులు సురేఖ జయప్రద శశికళ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.IMG-20241027-WA0008

Tags:

Related Posts