వెలుగుల పండుగ దీపవళి. రాజేందర్ రావు

వెలుగుల పండుగ దీపవళి. రాజేందర్ రావు

*వెలుగుల పండుగ దీపావళి* 

 *కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు* 

 *ప్రజలందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు* 

 *కరీంనగర్*..

ఇంటింటా దీపాలు వెలిగించుకొని సంతోషంగా జరుపుకునే వెలుగుల పండుగ దీపావళి అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. గురువారం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనంద దీపావళి ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. 

హిందూ సంస్కృతిలో దీపావళి విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటామని, మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. సంకల్పం, చైతన్యంతో ముందుకు సాగేందుకు దీపావళి పండుగ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటించాలని వెలిచాల రాజేందర్ రావు సూచించారు. హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ దీపావళి అని పేర్కొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని ప్రజలంతా ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకోవాలని రాజేందర్ రావు ఆకాంక్షించారు. దీపావళి పండుగ ప్రజలందరి ఇండ్లలో కొంగోత్త వెలుగులు నింపాలని రాజేందర్ రావు పేర్కొన్నారు.IMG-20241030-WA0012

Tags:

Related Posts