*- - - పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.* ఎస్పీ అశోక్ కుమార్
*- - - పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.*
*- - - పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్ష*
- - జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్,30
విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందుతున్న ఏ.ఎస్.ఐ వలి బెగ్, హెడ్ కానిస్టేబుల్ రాజయ్య లను శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన ఎస్పీ
ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. విజయవంతంగా సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు. పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.
అనంతరం పదవి విరమణ పొందిన అధికారులను పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏ ఆర్,భీమ్ రావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్, వేణు, సి సి ఎస్,ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

