#Draft: Add Your Title
Churakalu
రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం... సేవా కార్యక్రమాలు చేపట్టడంలో రోటరీ క్లబ్ కు ఓ ప్రత్యేకత....
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తోపుడుబండ్ల పంపిణీ సందర్భంగా
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు..
చురకలు ప్రతినిధి కరీంనగర్ సెప్టెంబర్ 16
రోటరీ క్లబ్ కరీంనగర్ చేస్తున్న సేవలు అభినందనీయని, సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ కు ప్రత్యేకత ఉందని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు , బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రోటరీ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలో సోమవారం రోజున చైతన్యపురి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమానికి బండి సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రోటరీ క్లబ్ కరీంనగర్ , రోటరీ క్లబ్ మొయినాబాద్ సహకారంతో పది తోపుడు బండ్లను వీధి వ్యాపారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ద్వారా సోమవారం రోజున వీధి వ్యాపారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వీధి వ్యాపారులతో మాట్లాడారు.రోజువారి ఆదాయం ఎలా ఉంటుంది, మీ కుటుంబ పోషణ సరిపోతుందా..? అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోటరీ క్లబ్ అందించిన తోపుడు బండిని కుటుంబ పోషణకు ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే ఇంజనీర్స్ డే ను పురస్కరించుకొని ఇంజనీర్ లు జీవి కిషన్, పవన్ కృష్ణ, కిరణ్ కుమార్, అరవింద్, రామేందర్, రాజశేఖర్ లను కేంద్రమంత్రి బండి సంజయ్ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డి. కె. ఆనంద్, రోటరీ క్లబ్ కరీంనగర్ అధ్యక్షుడు జి. వెంకట కిషన్, కార్యదర్శి పాక పవన కృష్ణ, మాజీ కార్పొరేటర్ చీటీ రామారావు, రామ్ మోహన్ రావు, ఆనంద్ కుమార్, పసుల తిరుపతి, ప్రభాకర్ రావు, చందర్ లక్ష్మీనారాయణ ,ఆంజనేయులు ,రాజేందర్, తిరుపతి, రోటరీ క్లబ్ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

