ఎగిసిపడ్డ ఉద్యమం.... ఫలించిన పోలీసు వ్యూహం
ఎగిసిపడ్డ ఉద్యమం... ఫలించిన పోలీసు వ్యుహాం.
మావోయిస్టుల అణిచివేతలో తెలంగాణ పోలీస్ సక్సెస్...
ప్రాణాలకు ఒడ్డిన సంఘటనలు ఎన్నో....
ఒక చైత్రయాత ఇక్కడే....ఓ డిఎస్పీ హత్య ఇక్కడే....
ఎన్నో మలుపులు తిరిగి చల్లారిన కల్లోల ప్రాంతాలు.....
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 20 : నక్సలైట్ ఉద్యమానికి శ్రీకాకుళం జిల్లా జీవం పోస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా పునర్జీవం పోసింది. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన జగిత్యాల జైత్రయాత్ర.... ధర్మపురిలో పేలిన తొలితూట కోమల్రెడ్డి హత్య, పెద్దపల్లిలో డిఎస్పి బుచ్చిరెడ్డి హత్య, ఎన్కౌంటర్ల పరంపర, బస్సు దహనాలు, ఇన్ ఫార్మర్ల హత్యలు ... ఊర్లు వదిలిన భూస్వాములు కల్లోల ప్రాంతాలుగా మారిన పల్లెలెన్నో తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా సక్సలైట్ ఉద్యమాన్ని అనచడం కోసం పోలీసులు సైతం తమ ప్రాణాలను
పణంగా పెట్టిన సందర్భాలు ఎన్నో. జగిత్యాల జైత్రయాత్ర 1980 నుండి మొదలైన.. గ్రామాల్లో రైతు కూలీ సంఘాలు ఏర్పాటు క్రమంగా పీపుల్స్ వార్ పార్టీ దళాల ఏర్పాటు ఇక అప్పటినుండి వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు గ్రామాలు పట్టణాలు తేడా లేకుండా అట్టుడికి పోయాయి. ఎగిసి పడ్డ నక్సలైట్ ఉద్యమాన్ని అణిచివేయడం కోసం. పోలీసులు వ్యూహత్మకంగా అనేక చర్యలు చేపట్టారు. ఒకవైపు లొంగుబాట్లు మరోవైపు తెగించి ఎన్కౌంటర్లు ఈ సమయంలో రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. పోలీసులు సైతం తమ ప్రాణాలను లెక్కచేయకుండా నక్సలైట్ల అణిచివేత కోసం పెద్ద ఎత్తున శ్రమించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉపందుకున్న ఉద్యమాన్ని ఇక్కడి జిల్లాలోని అణిచివేతకు శ్రీకారం చుట్టారు. పోలీస్ అధికారుల నిర్ణయాలు ఇది తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. రెండు వర్గాల మధ్య యుద్ధమై నడిచింది. 2004 తర్వాత శాంతి చర్చల సమయంలో క్రమంగా లొంగుబాట్ల పర్వం పెరిగింది. ఆ సమయంలో పోలీసుల వైపు నుండి ప్రాణ నష్టం కూడా తగ్గిపోయింది. నక్సలైట్ ఉద్యమం పునర్జీవం పోసుకున్న కల్లోల కరీంనగర్ జిల్లా చల్లారిపోతూ.. అభివృద్ధి బాటల వైపు అడుగులు పడ్డాయి. అప్పట్లో 200 మంది అజ్ఞాత నక్సలైట్లు ఉన్న మావోయిస్టు పార్టీకి ఇప్పటి లెక్కల ప్రకారం రెండు పదుల
సంఖ్య కూడా దాటదంటే పోలీసు అధికారుల వ్యూహం ఎత్తుగడలు ఏ విధంగా ఫలించాయో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమబెంగాల్లోని నక్సల్ బరి గ్రామంలో భూమి కోసం, భుక్తి కోసం పీడిత ప్రాంతాల విముక్తి కోసం ప్రారంభమైన సాయుధ పోరాట విప్లవం నాటి ఉమ్మడి రాష్ట్రంలోని శ్రీకాకుళం మీదుగా అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో వేగంగా వ్యాప్తి చెందింది. 1980 ఏప్రిల్ 22న ఏర్పాటైన పీపుల్స్ వార్ గ్రూప్ అణిచివేతకు గురవుతున్న ప్రజల్లో చైతన్యాన్ని నింపి పోరాటాల వైపు నడిపించడంలో సఫలీకృతమైంది. ప్రధానంగా
ఉత్తర తెలంగాణలోని గ్రామాల్లో భూస్వామ్య దోరలు, పటేల్, పట్వారీల ఆరచకాలు, అణిచివేతలు, అన్యాయాలను, వెట్టిచారికిని సహించలేని ఉన్నత చదువులు చదువుతున్న
విద్యార్థులతో పాటు, రైతులు, రైతుకూలీలు, మహిళలు, యువత, విద్యార్థి సంఘాలతో సుమారు మూడు దశాబ్దాల పాటు విప్లవోద్యమాలు నడిపించగలిగాయి. రైతు కూలీ సంఘాలు, రాడికల్ యూత్ లీగ్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లాంటి సంస్థల పోరాటాలతో పీపుల్స్ వార్ గ్రూప్ బలమైన సంస్థ ఎదిగింది. 1977లో జగిత్యాల జైత్రయాత్ర పేరున కాగడాల ప్రదర్శన ద్వారా బలమైన ప్రదర్శనగా పలు సమస్యలపై పోరాటాలను నిర్వహించడం ద్వారా ప్రజల మద్దతును కూడగట్టుకొని ఇక్కడ నుండే ఉద్యమాన్ని విస్తరించింది అప్పటి పీపుల్స్ వార్. అగ్ర నాయకులు, వ్యవస్థాపక నాయకులు ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల కోటేశ్వర్రావు, కటుకం సుదర్శన్, వల్లా ఆది రెడ్డి, శీలం నరేష్ వంటి అగ్రశ్రేణి నక్సల్ నాయకులు జిల్లా నుండి ఉద్యమంలోకి వెళ్లి ఉద్యమాలను నడిపించారు. పీపుల్స్వర్ కాలక్రమేన మావోయిస్టుపార్టీగా మారింది. ఉమ్మడి జిల్లాలో
జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, మెట్పల్లి, సిరిసిల్ల, బోయినపల్లి, పెద్దపల్లి, హుజురాబాద్, హుస్నాబాద్, మంథని, ముత్తారం ప్రాంతాల్లో దళాలు, ఏరియా కమిటిలు, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సికాస సింగరేణి కార్మిక సమాఖ్యగా ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించింది. ఆతర్వాత జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్నపేట
ఎన్ కౌంటర్లో అరికెల్ల శంకర్ అలియాస్ భూపతి దళానికి చెందిన డిప్యూటీ కమాండర్, మరాఠా రవి, భూపతి భార్య లక్ష్మి, విలాసాగర్ విజయలక్ష్మి, సూర్యం, భారతక్క, సంధ్య, రాజయ్య అనే ఆరుగురు దళ సభ్యులను ఏకకాలంలో పొగొట్టుకున్నారు. మల్యాల దళ ప్రభావం ఉన్న మల్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఎన్ కౌంటర్ తర్వాత 2000 సెప్టెంబర్ 20న మంథని, ముత్తారం ప్రాంతంలోని దుబ్బలపాడు వద్ద అరికెల్ల శంకర్ అలియాస్ భూపతి ఎన్ కౌంటర్లో హతమవ్వడంతో మల్యాల దళం కనుమరుగైంది. ఆ తర్వాత ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామ శివారులోని సంకెనబోర్డు గుట్టపై జరిగిన ఎన్ కౌంటర్లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటి
సభ్యురాలు. కరీంనగర్ పశ్చిమ డివిజన్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి న్యాలకొండ రజిత అలియాస్ పద్మక్క, సాగర్, విక్రమ్, మానసలు మృతి చెందారు. తర్వాత పద్మక్క మృతితో
తగ్గుముఖం పట్టిన మావోల కార్యక్రమాలకు అప్పటి జిల్లా కమిటి సభ్యుడు. మెట్పల్లి దళ కమాండర్ భాస్కర్ తన నేతృత్వంలో కార్యాకలాపాలు కొనసాగిస్తుండగా మానాల ఎన్ కౌంటర్లో భాస్కర్ మృతితో అప్పటి నుండి పార్టీ కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయి. అడప దడపగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆదిలాబాద్ జిల్లా క్యాడర్ సంచరించడం జరుగుతుంది.

