ఎస్ అర్వో కార్యలయంలో ప్రతి పనికి ఓ రేటు
ఎస్ఆర్వో కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు.
జిల్లాలో రిజిస్ట్రేషన్లో ఎవరి ధోరణి వారిది
కొందరి ద్వారానే పనులు అవుతున్న వైనం
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 7 : జగిత్యాల జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందిస్తున్న వివిధ సేవలకు గాను ప్రతి ఓ రేటు నిర్ణయించి చేతులు తడపనిదే ఏపని జరగడం లేదనే విమర్శ లతో పాటు పలు రకాల రిజిస్ట్రేషన్లలో ఎస్ఆర్వోలు విభిన్న రకాలుగా ఎవరి ధోరణితో వారు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని జగిత్యాల, మల్యాల, మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ప్రభుత్వం నుండి అందించే వివిధ రకాలు రిజిస్ట్రేషన్ సేవలు జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఓకే విధంగా ఉండాల్సి ఉండగా ఒక కార్యాలయంలో కొన్ని సేవలు అందిస్తుండగా మరో కార్యాలయంలో ఆ సేవలు అందించకపోవడం చూస్తే ఆ శాఖలోని అధికారులు తమకు లాభం ఉంటేనే ఆ సేవలు
అందించడం, లాభం లేకపోతే ఆ సేవలు అందించడం లేదని తెలుస్తుంది. జిల్లా లోని జగిత్యాల కార్యాలయంలో ప్రభుత్వపరంగా ఫీజులు చెల్లించిన తర్వాత యాధవిధిగా అందించే సేవల్లో ఈసి, సర్టిఫైడ్ కాపీలు, పలు రకాల కోర్టులు, నోటరీ స్టాంప్ విషయంలో ప్రభుత్వం విధించిన ఫీజులతో పాటు ప్రతి పనికి రూ.200 నుండి 500 వరకు సిబ్బందికి అధికంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి కార్యాలయాల్లో అందించే పలు రకాల సేవల విషయంలో ఎస్ఆర్వోలు తమకు అనుకూలంగా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వస్తేనే రిజిస్ట్రేషన్లు చేయడం, అనుకూలంగా లేని ద్వారా వస్తే రిజిస్ట్రే షన్ల విషయంలో నానా కోర్రీలు పెడు తుండటం పలు సందర్భాల్లో ఈ డాక్యు మెంట్ రిజిస్ట్రేషన్ చేయలేమని, తిరిగి
పంపించడం జరుగుతుంది. పలు సందర్భాల్లో ప్రజలు రోజుల తరబడి తిరిగి అధికారులకు అనుకూలంగా వ్యవహ రించే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఫైళ్లు పంపిస్తే పెద్దమొత్తంలో ముట్టజెప్పిన తర్వాత పనులు కానిచేస్తున్నారని, ప్రజ లతో పాటు పలువురు డాక్యుమెంట్ రైటర్లు బహరంగంగా చెబుతుడటం గమనార్హం. జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లిల్లో ఎస్ఆర్వోలు తమకు అనుకూలం గా ఉన్న డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఏలాంటి పనినైనా పెద్ద మొత్తంలో డబ్బు లు తీసుకొని చేస్తున్నారనే విమర్శలు న్నాయి. జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి
ప్రాంతాల్లో అక్కడి ఎస్ఆర్వోలు వ్యవ
సాయ భూములకు గాను తహసీల్దార్ల నుండి వ్యవసాయేతర భూములుగా
(నాలా) మార్చుకొని తీసుకవస్తేనే రిజిస్ట్రేషన్లు జరుపుతుండగా జిల్లా కేంద్రమైనా జగిత్యాలలో మాత్రం గత నెల రోజులుగా నాలా ఉత్తర్వుల ద్వారా ఏలాంటి రిజిస్ట్రేషన్లు చేయడం లేదని పలువురు పేర్కోంటున్నారు. ప్రభుత్వ నిబంధనలుంటే జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఒకే విధంగా లేకపోవడం పరిశీలిస్తే కోరు ట్ల, మెట్పల్లి కార్యాలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏలా చేస్తున్నారని, జగిత్యాలలో చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికంగా ఉండని పలువురు అధికారులు, సిబ్బంది జిల్లాలోని జగిత్యాల, మల్యాల, కోరుట్ల,
మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో
అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు
అటెండర్లే పెద్ద దిక్కుగా ఉంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.

