కువైట్ లో జగిత్యాల వాసి మృతి
కువైట్ లో జగిత్యాల వాసి మృతి...
చురకలు విలేఖరి
జగిత్యాల, సెప్టెంబర్ 18.
జగిత్యాల పట్టణ ,కటికెవాడ కి చెందిన కొత్త కొండ సాయి కృష్ణ గౌడ్ (37) జీవన్ ఉపాధి కోసం కువైట్ వెళ్ళాడు, ఆదివారం డ్యూటీ చేసుకొని రూం కి వచ్చి నిద్రిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు , మృతిని దేహాన్ని బుధవారం ఇంటికి తీసుకొచ్చారు, మృతినికి భార్య, కొడుకు (8) పాప (6 ) ఉన్నారు, భార్య పిల్లల ఏడుపు నీ చూసి స్థానికి కులు కన్నీటి పర్యుంతులయ్యారు...
మధ్యతరగతికి చెందిన కొత్తకొండ సాయి కృష్ణ గౌడ్ (37) గత పది సంవత్సరాలుగా కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి పని చేసుకునేవాడు.ఈమధ్య ఇండియాకు వచ్చి తీర్థయాత్రలకు వెళ్లి మోక్కులు చెల్లించుకుని గత నెల రోజులకు క్రితం తిరిగి మళ్లీ గల్ఫ్ కు వెళ్లాడు. అకస్మాత్తుగా గత ఆది వారం సాయి కృష్ణ మృతి చెందాడని తన స్నేహితుల ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. గత నెల రోజుల క్రితం ఇండియాలో కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి సంతోషంగా ఉన్న సాయి కృష్ణ మరణించడు అనే వార్తను విని తన కుటుంబ సభ్యులు తట్టుకోలేక పోయారు. సాయి కృష్ణ గుండె పోటుతో మరణించాడని తెలిపారు. తాను తిరుగు వెళ్లే సమయంలో ఈసారి వెళ్లేది చివరి సారి అని చెప్పి తిరిగి వచ్చాక తను సంపాదించిన డబ్బులతో మంచి వ్యాపారం పెట్టుకొని భార్య పిల్లలను సంతోషంగా చూసుకోవాలనే ఆశ నిరాశే అయింది.. రెండు రోజుల తర్వాత ఈరోజు వచ్చిన అతని మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా బోధించారు. స్థానికులు సైతం కంట తడి పెట్టారు మృదు స్వభావి అయిన సాయి కృష్ణ అందరితో కలిసి మెలిసి కుటుంబ సభ్యుల వలె ఆప్యాయంగా పలకరించే వ్యక్తి అందరికీ అని అతడు దూరం కావడం కలిచివేసింది అని భావిస్తున్నారు. అతడి మృతదేహం ఈరోజు రావడంతో అంత్యక్రియలు నిర్వహించారు.. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుకున్నారు..

