సాంప్రదాయ రీతిలో బొడ్డెమ్మ నిమజ్జనం

సాంప్రదాయ రీతిలో బొడ్డెమ్మ నిమజ్జనం

సాంప్రదాయ రీతిలో బొడ్డెమ్మ నిమజ్జనం
..................................................
 రామ కిష్టయ్య సంగన భట్ల...
     9440595494
...................................

సనాతన ప్రాచీన హైందవ సాంప్రదాయాలకు అనాది నుండి సాక్షీభూతంగా నిలిచి యున్న సుప్రసిద్ధ గోదావరి తీరస్థ పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో ఆదివారం బొడ్డెమ్మ పండుగ సంబరాలు వైభవంగా, ఆనందోత్సవాల మధ్య జరుపు కున్నారు. ఈక్షేత్రంలో జ్యేష్టా దేవి, లక్ష్మీదేవిల ప్రతీకలుగా బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తి శ్రద్ధలతో, పిల్లా పాపలతో కలిసి మహిళలు జంట పండుగలుగా పక్షం రోజుల తేడాతో నిర్వహించడం అనాదిగా ప్రాచీన వంశపారంపర్య ఆచరణీ యమై ఉండగా, శ్రావణ బహుళ అమా వాస్య, పోలాల అమావాస్యతో ప్రారంభించి భాద్రపద పౌర్ణమి అనంతరం ముగించబడే బొడ్డెమ్మ పండుగలో భాగంగా క్షేత్రంలోని రామానందీశ్వర ఆలయ సంబంధిత
ప్రధాన వాడలో మట్టితో బొడ్డెమ్మను తయారు చేసి ఉంచి, పదిహేను రోజు లపాటు అన్ని రకాల పూలతో పూజించి, ఆటలాడి, ప్రదక్షిణలాచరించి, నివేదనలు ఉంచడం అనాదిగా ఆచరిస్తున్న పరంపరానుగత సదాచారం. బొడ్డెమ్మను సాగనంపనిదే బతుకమ్మ పండుగ చేయని సాంప్ర
దాయ నేపథ్యంలో ఆ ఆచారాన్ని అనుసరించి
బొజ్జా వారి, పెద్దంభట్ల వారి గద్దెల సంబంధిత మహిళలు, పిల్లలు15 రోజులపాటు బొడెమ్మ వేడుకలను నిర్వహించి, చివరి రోజైన ఆదివారం వేరువేరుగా రెండు చోట్ల సామూహిక భోజనాలు ఆరగించి, సాయం సమయాన పిల్లాపాపలను పెళ్ళి కూతుళ్ళలా సింగారించి, నూతన ప్రస్తాలంకృతులైన మహిళలు గోదావరి నది వరకు మేళతాళాలతో పాటలతో ఒకే జట్టుగా ఊరేగింపు జరిపారు. నదీ తీరాన తిరిగి ఆటపాటలతో గడిపి, రాత్రి సమ యమైనాక నది నీటిలో బొడ్డెమ్మలను నిమజ్జనం చేసి వెను తిరిగారు. సాయంత్రంతో ప్రారంభమై, రాత్రి వరకూ జానపద బాణీలో కొనసాగు తున్న వారసత్వ సాంప్రదాయాలకు అనుగుణంగా బృందగానం చేసిన సాంప్రదాయ గీతాలు మంత్రముగ్ధుల గావించాయి.IMG-20240929-WA0007

Tags:

Related Posts