హత్యాయత్నం కేసులో నిందితునికి 2 ఏళ్ల జైలు శిక్ష

*హత్యాయత్నం కేసులో నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష   500  జరిమానా*


చురకలు విలేఖరి 
జగిత్యాల, అక్టోబర్,08

 హత్యాయత్నానికి పాల్పడిన బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని  గోపుల పూర్ కు చెందిన రొండి మాణిక్యం అనే నిందితునికి 2 సంవత్సరాల జైలు శిక్ష 500 రూపాయల జరిమానా విధిస్తూ కె. ప్రసాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి   తీర్పు వెల్లడించారు.

బుగ్గారం పోలీస్ స్టేషన్ పరిధిలోని  గోపుల పూర్ కి చెందిన రవీందర్ అతని తమ్ముడైన  మాణిక్యం యొక్క పిల్లలు మరియు భార్యకు ఆరోగ్య పరిస్థితిలో బాగా ఉండకపోవడానికి కారణం రవీందర్ యొక్క భార్య మంత్రాలు చేయడం వల్లనే అని నమ్మిన మాణిక్యం తరచు రవీందర్ తో గొడవలు జరుగుతూ ఉండేవి ఈ యొక్క గొడవలను మనసులో పెట్టుకొని మాణిక్యం రవీందర్ యొక్క భార్యపై కత్తితో దాడి చేయడం జరిగింది. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా మంగళవారం   రోజున జడ్జి గారు సాక్షులను విచారించిన అనంతరం నిందితుడు రొండి మాణిక్యం కు 2  సంవత్సరాలు జైలు శిక్ష 500 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఈ యొక్క జరిమానా కట్టలేని పరిస్థితిలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి  తీర్పు వెలువరించారు.ఈ  కేస్ లో అడిషనల్ పి పి గా సాయిళ్ళ మురళి   ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఎస్సై లు  మధుకర్, రవీందర్  సి యం యస్, ఎస్సై రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ శ్రీధర్, సి యం ఎస్ కానిస్టేబుల్ లు శ్రీధర్,కిరణ్  లు నిందితుని కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో  ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితుడు కి జైలు శిక్ష పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ అభినందించారు.

Tags:

Related Posts