జగిత్యాల పట్టణ అభివృద్ధియే ధ్యేయం ఆడువాల జ్యోతి లక్ష్మన్
జగిత్యాల పట్టణాభివృద్ధే ధ్యేయం.
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, సెప్టెంబర్ 30 : జగిత్యాల పట్టణాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా 14 అంశాలతో ఎజెండాను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని, త్వరలో జరిగే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలువురు సభ్యులు వార్డులోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, డిఈ యాదగిరి, మేనేజర్ సాగర్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి, టిపిఓ శ్రీనివాస్, టిపిఎస్ ప్రవీణ్, ఏఈలు శరణ్ తేజ, అనిల్, జెఏఓ గణేష్, సిబ్బంది పాల్గొన్నారు.

