అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కీ ప్రతిస్ట్మక యూనివర్సల్ ఐకాన్ అవార్డ్
“అల్ఫోర్స్” నరేందర్ రెడ్డికి ప్రతిష్టాత్మక యూనివర్సల్ ఐకాన్ ఆచీవర్ ఆవార్డ్ 2024
విద్యార్థులకు నాణ్యతమైన విద్యనందించడ్ చాలా ముఖ్యమైనదని మరియు ఖ్యాతి గడించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి.నరేందర్ రెడ్డి స్థానిక అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో వారికి ప్రతిష్టాత్మక యూనివర్శల్ ఐకాన్ ఆచీవర్ ఆవార్డ్ 2024 రావడం పట్ల ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 34 సం॥లుగా అల్ఫోర్స్ తెలంగాణ విద్యరంగంలో అనేక పెనుమార్పులు తీసుకరావడమే కాకుండా ఎంతో మంది విద్యార్థులను ప్రతిభవంతులుగా చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలుపుతూ తల్లిదండ్రుల ఆశయాలను దృష్టిలో పెట్టుకొని విద్యనందిస్తూ అగ్రగామిగా నిలుస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు.
చక్కటి ప్రణాళికలతో విద్యనందిస్తున్నందుకు యూ.ఏ.ఇ. చెందిన జెనటిక్స్ అల్టిమా వారు అల్ఫోర్స్ అవలంబిస్తున్న విద్య విధానాలకు వారు యూనివర్శల్ ఐకాన్ ఆచీవర్ ఆవార్డ్ 2024 ని ప్రకటించి ప్రతినిధి ద్వారా పంపించారని చెప్పారు. ఈ ఆవార్డు రావడానికి కృషి చేసిన పరిపాలన విభాగం వారికి, ప్రిన్సిపాల్స్కు, ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ఆవార్డు రావడం పట్ల విద్యసంస్థల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

