ఆల్ఫోర్స్ ఈ టెక్నో లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

ఆల్ఫోర్స్ ఈ టెక్నో లో ముందస్తు బతుకమ్మ సంబురాలు

 

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్లో వేడుకగా ముందస్తు బతుకమ్మ సంభరాలు

చురకలు ప్రతినిధి 

కరీంనగర్IMG-20240925-WA0009

ప్రకృతి పులకరించే మరియు ఆరాదించే పండుగ బతుకమ్మ పండుగ అని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో వైభవోపేతంగా పండుగ వాతవర్ణాన్ని మైమరిపించే విధంగా నిర్వహించినటువంటి అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ ముందస్తు బతుకమ్మ ఉత్సవ్ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు శాస్త్రోత్తంగా పాఠశాల ప్రాంగణంలో జ్యోతిప్రజ్వలన చేసి శ్రీ దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమం చేసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ అని గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరు సంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలని మరియు ఉత్తమంగా వ్యవహరించాలని చెప్పారు. బొడ్డమ్మ ఆరంభం నాటి నుండి మహాఅష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు మరియు ప్రకృతి పులకరించే పాటలతో చూడచక్కగా వేడుకలను జరుపుకుంటారని వారు చెప్పారు. ఊరూ వాడా తేడా లేదనుకుండ రెట్టింపు ఉత్సాహంతో పండుగను వైభవోపేతంగా నిర్వహించుకుంటారని మరియు సమజాంలో ఐక్యత, ప్రేమ అనురాగాన్ని ఆవిష్కరించే పండుగ ఇదేనని తెలుపుతూ ప్రకృతి ఒడిలో దొరికేటువంటి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి గౌరీమాత కృపను పొందుతారని చెప్పారు.

బతకమ్మకు అత్యంత ప్రీతికరమైనటువంటి గౌరీనూతను గుమ్మడి పూలతో తయారు చేసి ఆ అమ్మవారి కృపను వారి పరివారానికి నిలుపుకుంటారని తెలియజేస్తూ బతుకమ్మ పండుగ ద్వారా ప్రేమ అనురాగం చాలా వెల్లివిరిస్తూందని వారు చెప్పారు. ఎనిమిది రోజుల బతుకమ్మ వివిధ రకాల ప్రసాదాలతో ఆరాధించి అమ్మ వారి ఆశీస్సులను అధికంగా ఉండేలా చేస్తారని తెలిపారు.

ప్రత్యేకంగా అమ్మవారి శరనవరాత్ర్సోవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో కఠినంగా ఉపవాసాలను పాఠించి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారని మరియు అమ్మవారిని పది రోజులలో పది అవతారాలలో సుందరంగా అలంకరించి అమ్మవారిని సపరివారంగా సుహాసినిలందరు సుందరంగా ప్రతిష్ఠాపనకు మరియు ఆశిర్వచనానికి అట్టహాసంగా శ్రీలలిస సహస్రనామ పారాయణ ద్వారా ఆహ్వానించి పూజా కార్యక్రమాలను చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం పాఠశాలలో బతుకమ్మ విశిష్ఠతను తెలియజేయడానికై మరియు ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికై నేడు వేడుకగా బతుకమ్మ ఉత్సవాన్ని ముందస్తుగా నిర్వహించుకోవడం చాలా హర్షించదగ్గ విషయమని చెప్పారు. వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి మా ఊరి బతుకమ్మ బంగారు బతుకమ్మ, చిట్టి బతుకమ్మ వచ్చావమ్మ చూడమ్మ, జాతరపోదాం దసరా జాతర పోదాం నృత్యాలు చాలా ఆకర్షించాయి. ప్రత్యేకంగా ప్రాంగణంలో నిర్వహించినటువంటి దసరా మహోత్సవ సంభరం అంభరానంటింది. శమి పూజా, వాహన పూజ, ఆయుధ పూజ మరియు రావనాసుని వధ కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. సుమారు 250 మంది విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పాఠశాలలో పండుగ వాతావర్ణాన్ని రెట్టింపు చేశారు. అదే విధంగా సుమారు 500 సైగా బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారుచేసి వారి ఆనందాన్ని కొలాట ద్వారా ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

 

Tags:

Related Posts