టీచర్ గా ఎపికయున యువతికి సన్మానం
By: Mohammad Imran
On
ప్రభుత్వ టీచర్ గా ఎంపికైన యువతికి గ్రామస్తుల సన్మానం..
గొల్లపల్లి మండలం దమ్మన్న పేట గ్రామానికి చెందిన మిట్ట స్వప్న ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో ఎస్జిటి గా ఎంపికైంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మిల్కూరి అనసూయ, చంద్రయ్య, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే గ్రామానికి చెందిన అవారి రాజు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా ఎంపిక కావడంతో గ్రామస్తులు అభినందించారు.
Tags:

