మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ విద్యార్థి కనిపించకుండా పోయి రాత్రికి ఇంటికి చేరిన సంఘటన
మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ విద్యార్థి కనిపించకుండా పోయి రాత్రికి ఇంటికి చేరిన సంఘటన
చురకలు విలేఖరి
జగిత్యాల :సెప్టెంబర్ 21,
జగిత్యాల పట్టణంలోని ఖిల్లాగడ్డ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి నిషార్, శనివారం సాయంత్రం స్కూల్ గ్రౌండ్ నుండి కనిపించకుండా పోయి రాత్రి రాయికల్‌లోని తన ఇంటికి చేరాడు నిషార్ హాస్టల్ సిబ్బందితో పాటు తన తరగతి విద్యార్థులతో కలిసి సాయంత్రం 4 గంటల సమయంలో స్కూల్ ఆవరణలోని ఖిల్లాగడ్డ గ్రౌండ్‌కి ఆటల కోసం వెళ్లాడు. టీచర్లు విద్యార్థులందరినీ గ్రౌండ్‌కి తీసుకెళ్లిన తరువాత, తిరిగి హాస్టల్‌కి వచ్చినప్పుడు నిషార్ మాత్రం కనిపించలేదు.విద్యార్థి కనిపించకపోవడంతో హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలియజేశారు. హాస్టల్ సిబ్బంది, టీచర్లు విద్యార్థి కోసం వెతకడంతో పాటు పట్టణంలో నిషార్ కనిపించే అవకాశాలపై ప్రయత్నాలు చేశారు.రాత్రికి ఇంటికి చేరిన నిషార్విద్యార్థి కనబడకపోవడంతో శోధన కొనసాగుతుండగానే రాత్రి 10 గంటల సమయంలో నిషార్ రాయికల్‌లోని తన ఇంటికి నడుచుకుంటూ చేరాడు. నిషార్ వివరాల ప్రకారం, గ్రౌండ్ నుండి హాస్టల్‌కి తిరిగి వెళ్లేటప్పుడు వీధి కుక్కలు తరమడంతో భయపడిపోయి, ఇంటి దారిని పట్టుకుని నడుస్తూ రాయికల్‌లోని తన ఇంటికి చేరాడు.విద్యార్థి సురక్షితంగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, హాస్టల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదే హాస్టల్ లో గతంలో ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా ప్రిన్సిపల్, వార్డెన్ లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం, జిల్లా స్థాయిలో కో ఆర్డినేటర్ ఉన్నా వీరి పై జిల్లా స్థాయిలో ఏలాంటి అజమాయిషీ లేకపోవడంతో ఈ హాస్టల్ నిర్వహణలో ఏలాంటి మార్పులు లేవని పలువురు అంటున్నారు.

