లక్ష్మిపూర్ బ్లూ బాయ్స్ ఆధ్వర్యంలో అన్నా దానం
By: Mohammad Imran
On
లక్ష్మీపూర్ బ్లూ బాయ్స్ ఆధ్వర్యంలో అన్నదానం.
జగిత్యాల: జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని కొత్తవాడ బ్లూ బాయ్స్ గణేష్ మండప నిర్వాహకులు మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్లూ బాయ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మంటపంలో అత్యంత భక్తిశ్రద్ధలతో గత తొమ్మిది రోజులుగా గణనాథునికి పూజలు, వివిధ రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. గణనాథున్ని గంగమ్మ ఒడిలోకి సాగనంపేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. చివరి రోజైన మంగళవారం గణేష్ మంటప నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో నిర్వాహకులతో పాటు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:

