పద్మశాలి సంఘంలో జయంతి వేడుకలు
పద్మశాలి సంఘంలో జయంతి కార్యక్రమం
చురకలు విలేఖరి
జగిత్యాల, అక్టోబర్,03.
పద్మశాలి సంఘ సంస్కర్త, చేనేత ఉద్యమ పితామహ, గాంధేయ వాది, గుంటక నర్సయ్య పంతులు - తడక యాదగిరి. బ్రహ్మా శ్రీ గుంటక నర్సయ్య పంతులు 122 వ జయంతి కార్యక్రమం.
కరీంనగర్ జిల్లా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ మరియు శరత్ సాహితీ కళా స్రవంతి , కరీంనగర్ సంయుక్త నిర్వహణలో , గురువారం సాయంత్రం 5 గంటలకు జగిత్యాల రోడ్ , ఆర్.టీ.సి.వర్క్ షాప్ కు ఎదురుగా నున్న పద్మశాలి హాస్టల్ నందు చేనేతోద్యమ పితామహ , అఖిల భారత పద్మశాలి సంఘం పూర్వ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గుంటుక నర్సయ్య పంతులు 122 వ జయంతి ఉత్సవము ఘనంగా జరిగింది. ఇట్టి కార్య క్రమమునకు పచ్చునూరు నరసయ్య సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ గుంటుక నర్సయ్య పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కరీం నగర్ పద్మశాలి హాస్టల్ నిర్మాణానికి వారు బూరి విరాళం ఇచ్చి ఆదర్శప్రాయంగా నిలిచారు. హైదరాబాద్ పద్మశాలి హాస్టల్ నిర్మాణంలోనూ, వారి పాత్ర ఘననీయమైనది. హైదరాబాద్ నల్లకుంట లోని పద్మా కాలని నిర్మాణంలో వారి కృషి గణనీయమైనది అని కొనియాడారు. ఇట్టి సందర్భంగా పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ స్వర్గం మల్లేశం పంతులు విగ్రహ ప్రతిష్ఠ పద్మశాలి హాస్టల్ లో చేయడానికి సంకల్పం చేస్తున్నాము అని తెలియ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి వచ్చిన విశ్రాంత అసిస్టెంట్ ప్రొఫెసర్ తడక యాదగిరి గుంటక నర్సయ్య పంతులు పై” గుంటక నరసయ్య పంతులు జీవితం - ఆదర్శం “ వ్రాసిన పుస్తకాన్ని వేదిక మీద పెద్దలు ఆవిష్కరించారు. తడక నర్సయ్య పంతులు పై అభిమానంతో పద్మ శాలి సమాజానికి వారు సేవలకు గుర్తింపుగా పుస్తకం వ్రాసాను అని తెలిపారు. పంతులు గారు ఆచార్య కొండా లక్ష్మణ్ కు గురువు లాంటి వారు అని తెలియ చేశారు. ఈ సందర్భంగా రచయితను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమములో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు, మెతుకు సత్యం, పద్మశాలి నాయకులు మాజీ మండల అధ్యక్షులు వాసాల రమేష్ , చొప్పదండి మాజీ జడ్పీటిసి ఇప్పనపల్లి సాంబయ్య , జిల్లా పోపా అధ్యక్షులు పోలు సత్యనారాయణ , పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ కార్యదర్శి అల్స భద్రయ్య పంతులు జీవితం సేవల గురించి ప్రంగించారు. విశ్రాంత ఉపన్యాసకులు, కవి, సబ్బని లక్ష్మి నారాయణ మాట్లాడుతూ వచ్చే సంవత్సరం గుంటక నర్సయ్య పంతులు పై అందరి సహకారంతో ఒక స్మారక సంచిక తేవాలి అని తన సంకల్పము గురించి తెలిపారు. ఈ కార్య క్రమంలో గుంటక నర్సయ్య స్వగ్రామం గోపాల పురం వాస్తవ్యులు, నర్సయ్య ని బాగా ఎరిగిన వాసం శివ నారాయణ పంతులు తో తమ జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు.. ఇట్టి కార్యక్రమములో అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వెంకటేశ్వర్లు, విశ్రాంత ఉపన్యాసకులు బొద్దుల లక్ష్మయ్య , గుంటుక నర్సయ్య పంతులుపై ప్రసంగం గావించారు. కవి నడిమెట్ల రామయ్య, చిలుక నర్సప్ప , దీకొండ లక్ష్మీ నారాయణ. వోడ్నాల కిషన్ , మల్లికార్జున్, వంగర ఆనందం, గుంటక రామచంద్రం, కవి కాళిదాసు,చిందం రమేష్ , పాము రాజేశం, శ్రీధర్, పద్మశాలి హాస్టల్ విద్యార్తులు పాల్గొన్నారు.

