టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టుల నియామకం
*టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ కమిటీ సభ్యులుగా కరీంనగర్ కు చెందిన జర్నలిస్టుల నియామకం*
చురకలు ప్రతినిథి
కరీంనగర్, సెప్టెంబర్,18
*తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యూజే, ఐజేయు) రాష్ట్ర అనుబంధ కమిటీ లను ప్రకటించగా జర్నలిస్టు రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులుగా బి జయసింహారావు, ఎన్ మహేంద్ర చారి, సోషల్ అండ్ డిజిటల్ మీడియా క్యాంపెయిన్ కమిటీ సభ్యులుగా ఒంటెల కృష్ణ, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యునిగా ఈద మధుకర్, జర్నలిస్ట్ హౌసింగ్ కమిటీ కమిటీ సభ్యునిగా చిగురుమామిడి మండలాకి చెందిన మారుతి ప్రకాష్ నియామకం అయ్యారు. హైదరాబాదులోని టియుడబ్ల్యూజె ఐజెయు రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు కే విరహత్ అలీ ప్రతిపాదించగా,రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. నియామకానికి సహకరించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. విరహత్ అలీ,రాష్ట్ర ప్రధాన కార్యర్శి కే రామనారాయణ, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు కరీంనగర్ జిల్లా కన్వినర్ నగునూరి శేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ పాత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు*.

