కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు పెరిగిన అక్రమాలు
కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు
పెరిగిన అక్రమాలు..
తలలు పట్టుకుంటున్న జిల్లా యంత్రాంగం, పాలకవర్గం...
జగిత్యాల ప్రతినిధి, అక్టోబర్ 13, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కరీంనగర్ తర్వాత పెద్ద మున్సిపాలిటీ కార్పోరేషన్ తర్వాత స్థాయి అయిన మొదటి శ్రేణి మున్సిపాలిటీ అయినప్పటికి ఇక్కడి రావడానికి మొదటి శ్రేణి స్థాయి కమిషనర్లు జంకుతుండటంతో ప్రస్తుత పాలకవర్గం ఓ క్రిందిస్థాయి సీనియర్ అసిస్టెంట్ ద్వారా ప్రస్తుత కమిషనర్ ను జగిత్యాలకు తప్పించుకున్న ఏకపక్ష నిర్ణయాలతో తలనొప్పిగా మారిందంటున్నారు. ఉమ్మడి జిల్లాలోనే మొదటి శ్రేణి మున్సిపాలిటీల్లో మొదటిస్థానంలో ఉన్న జగిత్యాల మున్సిపాలిటీకి ఆస్థాయి అధికారులు రావడానికి గత కొంతకాలంగా జంకుతన్నారు. ప్రజాప్రతినిధుల ఒత్తిడి. ఉద్యోగులు కూడా స్థానికులు అధికంగా ఉండడంతో జగిత్యాల
కమిషనర్ పోస్టుపై సుముఖంగా లేరని తెలుస్తుంది. అయితే గత చైర్పర్సన్ బీఆర్ఎస్ నుండి బిజెపిలోకి వెళ్లడం, కౌన్సిలర్ పదవికి రాజీనామ చేయడంతో కొంతకాలం వైస్ చైర్మన్ నెట్టుకొచ్చారు. ఆతర్వాత అవిశ్వాసం పరీక్ష ద్వారా ప్రస్తుత చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ చైర్పర్సన్ గా ఎన్నికైన విషయం విధితమే. ఈ పరిణామాలు, గతంలో నుండి కూడా కమిషనర్లకు, ప్రజాప్రతినిధుల మధ్య విబేధాలతో తరుచుగా కమిషనర్లు బదిలీపై వెళ్లిపోవడం, కొత్తగా వచ్చే వారు ఉత్సాహం చూపెట్టకపోవడంతో ప్రస్తుత పాలకవర్గ ప్రజాప్రతినిధి, జగిత్యాల మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్ తనకు తెలిసిన కమిషనర్ ఉన్నారని చెప్పడంతో ఏరికోరి మూడవశ్రేణి మున్సిపాలిటీలో పని చేసిన ప్రస్తుత కమిషనర్ తెచ్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుత కమిషనర్ నిర్ణయాలు. ఇదే పాలకవర్గానికి, జిల్లా యంత్రాంగానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. కమిషనర్ తన స్వంత కారును వాడుకుంటూ మున్సిపల్ నుండి డీజిల్, డ్రైవరు వాడుకుంటున్న వెలకు రూ.32 వల తీసుకోవడంపై కౌన్సిలర్లు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు. బతుకమ్మ ఏర్పాట్లకు గాను టెండర్లలో 28.99 శాతం లెస్ వేసిన కాంట్రాక్టర్కు కాకుండా 2 శాతం లెస్ వేసిన కాంట్రాక్టర్కు టెండర్ కేటాయించడంతో పాటు
మోటషన్. టౌన్ ప్లానింగ్లో కూడా ముడుపులు వచ్చిన ఫైళ్లనే ముడుతున్నట్లు స్వయాన కౌన్సిలర్లే విమర్శించడం గమనార్హం. గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో కూడా పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారితో కమిషనర్ వ్యవహరించిన తీరు వివాదస్పదం మారిందని, అది జరిగిన వారం రోజుల్లోనే ప్రజావాణిలో ఇంచార్జి కలెక్టర్తో దురుసుగా వ్యవహరించిన తీరు, దీని క్రమంలోనే దసరా పండుగా సందర్భంగా జంలిగద్దె వద్ద ఏర్పాటు చేసే జమ్మి వృక్షాన్ని ఆనవాయితీగా మున్సిపల్ నుండే ట్రాక్టర్ తీసుకొని వచ్చి దానికి ట్రాక్టర్ పంపవద్దని
క్రిందిస్థాయి ఉద్యోగులను దబాయించినట్లు, దీంతో పాలకవర్గం, ఉన్నతాధికారులు మోతె గ్రామ పంచాయితీ నుండి ట్రాక్టర్ తెప్పించుకొని ఏర్పాట్లు చేసుకోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అనుమతుల విషయంలో కూడా పాలకవర్గం, ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని, పాలకవర్గ సభ్యులు పలువురు
ఆరోపిస్తున్నారు. కమిషనర్ తీరుపై ఇటీవల్ పాలకవర్గం వారు ఓ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్లి మార్చాలని కోరగా, మీరే కోరి తెచ్చుకున్నారు. వేవేమి చేయలేనని చెప్పినట్లు, జిల్లా కలెక్టర్ కూడా జనవరి26తో పాలకవర్గం రద్దు కానుండటంతో 3 నెలల కోసం ఎందుకు మార్చాలని అనుకున్నట్లు చెబుతున్నారు. అయితే కలెక్టర్ సెలవుపై వెళ్లినప్పటి నుండి గణేష్ నిమజ్జనం, దసరా పండుగల సందర్భంగా, ప్రజావాణిలో వ్యవహరించిన తీరుతో జిల్లా యంత్రాంగం కూడా తలలు పట్టుకున్నట్లు తెలుస్తుంది. జిల్లాస్థాయి అధికారులకే వినని
కమిషనర్ ఇక పాలకవర్గ వైర్పర్సన్, సభ్యులతో ఇంకా ఏలా వ్యవహరిస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.
40 ఏళ్ల బల్దియా ఆచారానికి కమిషనర్ తుట్లూ..
పదహారు దశాబ్దాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె వద్ద దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ తర్వాత జగిత్యాలలోనే జంబిగద్దె ఏర్పాటు చేశారు. గత 40 ఏళ్లుగా జంబిగద్దెకు జగిత్యాల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జంబిచెట్టు తీసుకరావడం, రెవెన్యూ అధికారులు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవలే జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్తో జగిత్యాల బల్దియా కమిషనర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజావాణిలో జరిగిన గొడవను మనస్సులో పెట్టుకొని జంబిగద్దెకు జమ్మిచెట్టు తీసుకవచ్చే ట్రాక్టర్ను పంపవద్దని అనధికార ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ పాలకవర్గం చేసేదేమి లేక రెవెన్యూ అధికారులు మోలె గ్రామ పంచాయితీ ట్రాక్టర్ను అద్దెకు మాట్లాడి జంబిగద్దె జమ్మిచెట్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ తనకు అడిషనల్ కలెక్టర్ తో ఉన్న వ్యక్తిగత వాగ్వాదానికి 40 ఏళ్లుగా వస్తున్న ఆచారానికి పాటించకపోవడం సరికాదని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ విభాగంపై పలు ఆరోపణలు..
జగిత్యాల మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ విభాగంపై గత కొన్నేళ్లుగా పలు ఆరోపణలున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు పర్యవేక్షణ లేకుండా పనులు చేయడంతో పట్టణంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులకే వత్తాసు పలుకుతున్నారని పలువురు కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ వద్ద లైట్లు వెలగడం లేదని ప్రజాప్రతినిధులు, ప్రజలు కమిషనరు ఫిర్యాదు చేస్తే తనకు టవర్ ఎక్కడ ఉందో తెలియదని నిర్లక్ష్య ధోరణిలో సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

