బతుకమ్మ సంబరాలకు వేదికైన ధార్మిక క్షేత్రం ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబరాలకు వేదికైన ధార్మిక క్షేత్రం   ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ వేడుకలు

బతుకమ్మ సంబరాలకు వేదికైన ధార్మిక క్షేత్రం
..................................................
 ధర్మపురి క్షేత్రంలో బతుకమ్మ వేడుకలు 
..............................................
 రామ కిష్టయ్య సంగన భట్ల...
......................................

భారతీయ ప్రాచీన సంస్కృతికి, సనాతన హైందవ సాంప్రదాయాలకు అనాదినుండి పట్టు కొమ్మగా నిలిచియున్న సుప్రసిద్ధ గోదావరి తీరస్థ పుణ్య తీర్ధమైన ధర్మ పురి క్షేత్రంలో బతుకమ్మ పండుగ సంబరాలను సాంప్రదాయ పద్దతిలో ఘనంగా నిర్వహించేందుకు వేదిక సిద్దమైంది. ప్రతి పండుగనూ పరంప రానుగతంగా ప్రత్యేక శైలిలో, విశిష్ట పద్ధతిలో జరుపుకునే ధార్మిక కార్యాచ రణాసక్తుల నిలయమైన ధర్మపురి క్షేత్రంలో అపురూప సోదరీమణులైన జేష్టాదేవి, లక్ష్మీదేవిలను కొలుస్తూ, బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలను భక్తి శ్రద్ధలతో, పిల్లా పాపలతో కలిసి మహిళలు జంట పండుగలుగా పక్షం రోజుల తేడాతో నిర్వహించడం ఈ సనాతన క్షేత్రంలో అనాదిగా ఆచరి స్తున్న సనాతన సాంప్రదాయం. భాద్ర పద అమావాస్యతో ప్రారంభించి మహర్నవమితో ముగించబడే బతుకమ్మ పండుగలో మొదటి రోజున క్షేత్రం నడిబొడ్డున గల మహిమాన్విత మైన బ్రహ్మపుష్కరిణి (కోనేరు)లో, రెండవ రోజునుండి చద్దుల బతుకమ్మ వరకు, పవిత్ర గోదావరి నదిలో ఆట పాటలతో నిర్వహించి పిల్లా పాపలతో మహిళలు తన్మయత్వం పొందుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో.... ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ బతుకమ్మ గూర్చి, జనకునింటి ఉయ్యాలో అంటూ భూజాతయైన మహాసాధ్వి సీతాదేవి గురించేగాక కల వారి కోడలు కలికి కామాక్షి అంటూ సామాజిక అంశాల సమస్యలపై సైతం జానపద బాణీలో బృందగానం చేసే సాంప్రదాయ గీతాలు మంత్రముగ్ధులను గావిస్తాయి. మహాలయ అమా వాస్య బుధ వారం నుండి ధర్మపురి క్షేత్రం బతుకమ్మ సంబరాలకు  వేదిక కానుంది. తొలి రోజు బ్రహ్మ పుష్కరిణి (కోనేరు) వద్ద మహిళలు కుల మతాలకు అతీతంగా సామూహికంగా బతుకమ్మలను ఒక్కచోట ఉంచి వలయాకారంగా
తిరుగుతూ పాటలు పాడి, వెంట తెచ్చుకున్న తినుబండా రాలను ముందుగా నైవేద్యం పెట్టి, బతుకమ్మలను నదీ నీటిలో నిమజ్జనం గావించి, నివేదనలను తోటివారికి పంచుతూ, పిల్లలతో ముత్తయిదులు సామూహికంగా ఆరగిస్తారు. సాయంత్రమంతా ఆహ్లాదకర వాతావ రణంలో గడిపి చీకటి పడ్డాక ఇళ్ళకు చేరుకుంటారు.IMG-20241001-WA0017

Tags:

Related Posts