సూర్య గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు.
By: Mohammad Imran
On
సూర్య గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు.
జగిత్యాల. జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్య గ్లోబల్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు తంగేడు, గునుగు, తామెరా, గుమ్మడి, బంతి, చామంతి వంటి వివిధ రకాల పూలు సేకరించి బతుకమ్మను తయారు చేశారు. చిన్నారులు మరియు చిన్నారుల మాతలు చేసిన నృత్యాలు, కోలాట సంబరాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ రావు, రమాదేవి, రజిత రావు, హరిచరణ్ రావు, మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
Tags:

