*నాడు బతుకమ్మ అంటే ఒక తీపి జ్ఞాపకం* *నేడు బతుకమ్మ అంటే ఒక ఐక్యతకు నిదర్శనం* *-దావ వసంతసురేష్*
*నాడు బతుకమ్మ అంటే ఒక తీపి జ్ఞాపకం*
*నేడు బతుకమ్మ అంటే ఒక ఐక్యతకు నిదర్శనం*
*-దావ వసంతసురేష్*
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో జరిగిన ముందస్తు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్ గారు,మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతిలక్ష్మణ్ గారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ:-
ప్రకృతి గొప్ప తనాన్ని తెలిపేలా ప్రకృతి ఒడిలో పూసే పూలను పూజిస్తూ చేసుకునే గొప్ప పండుగ బతుకమ్మ.
మన బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి ప్రపంచంలోని మన తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి దేశంలో సంబురంగా నిర్వహించుకునేల బతుకమ్మ పండుగకు ఖ్యాతి తెచ్చిన ఘనత ప్రియతమ నాయకురాలు మన తెలంగాణ ఆడపడుచు కవితక్క గారికే దక్కుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నామన్నారు..
బతుకమ్మను ఏవిధంగా నైతే ఒక్కొక్క మెట్టుగా పెరుస్తమే ఆదే విధంగా మి జీవితంలో మీరు కూడా మీ జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన వాటిని అధిగమించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా మి కుటుంబసభ్యురలిగా తెలుపుతున్నానని అన్నారు..
బతుకమ్మ అంటే సల్లగ బతుకు అమ్మ అనే నిర్వచనం జగతికి చాటేలా మన తెలుగింటి ఆడపడుచులు సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుతూ పేద ధనిక అనే తేడాలు లేకుండా అందరూ కలిసికట్టుగా బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నారు...
ఈ కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ శీలం ప్రియాంకప్రవీణ్,కౌన్సిలర్లు చుక్క నవీన్,వల్లెపు రేణుకమొగిలి,భారతి, కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ,అధ్యాపక బృందం మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు...

