ఎమ్మెల్సీ గా పోటీచేస్తున్న ఆశీర్వదించండి నరేందర్ రెడ్డి

ఎమ్మెల్సీ గా పోటీచేస్తున్న ఆశీర్వదించండి నరేందర్ రెడ్డి

-  ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న...ఆశీర్వదించండి...

  -  చట్టసభలో నిరుద్యోగుల సమస్య లపై పోరాడుతా....

  - వాకర్స్ తో ఆల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి 

చురకలు ప్రతినిధి

IMG-20240925-WA0007కరీంనగర్ సెప్టెంబర్ 25

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల సాధనకు చట్టసభలో వారి పక్షాన పోరాటం చేస్తానని... కరీంనగర్ ఆదిలాబాద్-నిజమాబాద్-మెదక్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి  ఆల్ఫోర్ సంస్థల అధినేత డా వి. నరేందర్ రెడ్డి  పేర్కొన్నారు.. బుధవారం కరీంనగర్ శాతవాహనయూనివర్సిటీ ,కేడీఆర్( కటారి దేవేందర్ రావు పార్కు) లో వాకార్స్ ను కలసి రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు.. అనంతరం ఎల్ఐసి ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగం రాక, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని అన్నారు. ఉద్యోగాల ఖాళీల భర్తీకి, డీఏ, ఇంక్రిమెంట్ల సాధనకు, ప్రైవేట్ విద్యాసం స్థల్లో పనిచేసే వారికి ఆరోగ్యకార్డులు, ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అందించేలా కృషి చేస్తానన్నారు. నూతన విద్యా పాలసీ తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, దీనివల్ల ఇంటర్, పదో తరగతి బోర్డులు ఉంటాయా? లేదా? అనే సందే హాలు కలుగుతున్నాయని అన్నారు..దీనిపై ప్రభుత్వంతో చర్చించేందుకు, సమస్యల పరి ష్కారానికి తనను గెలిపించా లని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా గెలిచాక సేవకుడిగా ఉంటానని, తన వేతనాన్ని పేదల విద్యాభ్యాసం, నిరుద్యోగ సంక్షేమనిధి ఏర్పాటు చేసి కేటాయిస్తానని తెలిపారు. ప్రస్తుతం పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతోం దన్నారు.  ఈ కార్యక్రమంలో పీవీఎన్ఆర్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్  ప్రెసిడెంట్ హనుమండ్ల రఘుపతిరెడ్డి, జనరల్ సెక్రటరి కొండ రవీందర్, వైస్ ప్రెసిడెంట్లు కర్ర సత్యనారాయణ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, పాలోజు  రవీందర్, గౌరవ సలహాదారులు పిట్టల నర్సయ్య, చక్రధరస్వామి, శ్యాంసుందర్ రెడ్డి,బుస్సా శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, అనిల్, విజయ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts