ప్రస్తుత పరిస్థితుల కారణంగా శాంతి ర్యాలి రద్దు హాఫిజ్ సయ్యద్ మొయుజ్ద్దీన్ ఖాద్రి యూసుఫ్

ప్రస్తుత పరిస్థితుల కారణంగా శాంతి ర్యాలి రద్దు హాఫిజ్ సయ్యద్ మొయుజ్ద్దీన్ ఖాద్రి యూసుఫ్

ప్రస్తుత పరిస్థితుల కారణంగా శాంతిర్యాలీ రద్దు 

ఆనవాయితీకి విరుద్దంగా మిలాదున్నబి శాంతిర్యాలీ నిర్వహించడం సరైంది కాదు

అందుకే సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ శాంతిర్యాలీ రద్దు..ఇతర ర్యాలీలతో తమకు సంబంధం లేదు

సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్ వెల్లడి

కరీంనగర్, సెప్టెంబర్ 17:-

మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనెల16న నిర్వహించే ఈద్ మీలాదున్నబీ ర్యాలీని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా, పోలీసు శాఖ ద్వారా అనుమతి లభించకపోవడం వల్ల సోమవారం నిర్వహించతలపెట్టిన శాంతి ర్యాలీ పాదయాత్ర రద్దు చేసినట్లు సున్నీ మర్కజీ మీలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఆనవాయితీకి విరుద్ధంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ శాంతి ర్యాలీని నిర్వహించకపోవడమే మంచిదనే కారణంగా తమ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన యావత్తు ప్రపంచానికి మార్గ నిర్దేశకత్వమని అలాంటి మహనీయుడు పుట్టినరోజున, కాకుండా మరొక రోజు వేడుకలు నిర్వహిస్తే అందుకు అర్థం ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వకపోవడం, పోలీసు శాఖ అనుమతి లభించకపోవడంతో తాము ర్యాలీ రద్దు చేశామన్నారు. ఇతర రోజున కార్యక్రమాలు, శాంతి ర్యాలీ నిర్వహిస్తే దానికి అర్థం ఉండదన్నారు. ఇతర ర్యాలీలతో తమ కమిటీకి ఎలాంటి సంబంధం ఉండబోదని, సున్నీ మర్కజి మీలాద్ కమిటీ ఎలాంటి ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడం లేదని, ఆదివారం వరకే తమ కార్యక్రమాలు ముగించామని వెల్లడించారు.IMG-20240917-WA0061

Tags:

Related Posts