జర్నలిస్టు సూర్యప్రకాశ్ కు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జ‌ర్న‌లిస్టు సూర్య‌ప్ర‌కాష్‌కు అండ‌గా  ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి 
* వైద్య ఖ‌ర్చుల‌కు రూ.10 ల‌క్ష‌లు మంజూరు
* మంగ‌ళ‌వారం చెక్ అంద‌జేయ‌నున్న అధికారులు
హైద‌రాబాద్:  తీవ్ర అనారోగ్యానికి గురై ఢిల్లీలోని మాక్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కేవీఎన్ఎస్ఎస్ ప్ర‌కాష్ వైద్య ఖ‌ర్చుల నిమిత్తం ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రూ.10 ల‌క్ష‌లు మంజూరు చేశారు. ఢిల్లీలో సాక్షి జ‌ర్న‌లిస్టుగా ప‌ని చేస్తున్న కేవీఎన్ఎస్ఎస్ ప్ర‌కాష్ మెద‌డులో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డంతో అనారోగ్యానికి గురై  మూడు రోజుల క్రితం ఢిల్లీలోని ఆసుప‌త్రిలో చేరారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి తెలుసుకున్న ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌క్ష‌ణ‌మే స్పందించారు. ప్ర‌కాష్ వైద్య ఖ‌ర్చ‌ల‌కు రూ.ప‌ది ల‌క్ష‌లు మంజూరు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన చెక్కును మంగ‌ళ‌వారం ఢిల్లీలో అధికారులు ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు అంద‌జేయ‌నున్నారు.

Tags:

Related Posts