Churakalu News
*ప్రవక్త బోధనలు యావత్* *మానవాళికి దిక్సూచి*
*మిలాద్-ఉన్-నబీని ముస్లిం* *సోదరులు ఘనంగా జరుపుకోవాలి*
*కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ* *ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు*
*చురకలు ప్రతినిధి కరీంనగర్*..
శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్- నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు, సోదరీ మణులందరికీ వెలి చాల రాజేందర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన సబ్ర్ (సహనం), సిద్‌క్ (సత్యనిష్ట), తహారత్ (పవిత్రత), జకాత్ (సహాయం) రహ్మా (దయ) అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు.
ప్రతీ ముస్లీం సోదరుడు ఆ ప్రవక్త ప్రవచించిన సన్మార్గాలను పాటిస్తూ, పవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగను ఇంటింటా భక్తిశ్రద్ధల మధ్య, ఆనందో త్సవాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు.
ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

