కొనారావుపేటలో నాటుబాంబుల కలకలం

*కోనరావుపేట మండలంలో నాటు బాంబుల కలకలం*

*పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు*

కోనరావుపేట మండలం ధర్మారంలో జరిగిన నాటుబాంబు ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ధర్మారంలో మల్లేశం అనే రైతుకు చెందిన గేదె గతంలో నాటుబాంబు పేలి గాయపడిన విషయం అందరికి విధితమే. ఈ విషయమై చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ధర్మారం గ్రామానికి వెళ్లి సంఘటనపై విచారణ జరిపారు. ధర్మారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పలువురికి నాటు బాంబులు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు. అతడు చెప్పిన వివరాల ప్రకారం రాజన్నగొల్లపల్లి, బోనాలకు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బోనాలకు చెందిన వ్యక్తి దగ్గర నాటుబాంబులు లభ్యమైనట్టు సమాచారం.

Tags:

Related Posts