జర్నలిస్టు హెల్త్ కమిటీ సభ్యునిగా దండి సంతోష్ కుమార్
జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యులుగా దండి సంతోష్ కుమార్.
చురకలు ప్రతినిధి
వేములవాడ సెప్టెంబర్ 17:
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి అనుబంధ కమిటీ అయిన రాష్ట్ర జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యునిగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ నియామకం అయ్యారు. హైదరాబాద్ లోని టియూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె .విరాహత్ అలీ దండి సంతోష్ కుమార్ పేరును ప్రతిపాదించగా కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.
తన నియమాకానికి సహకరించిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీ, రాష్ట్ర కార్యవర్గానికి, దండి సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్బంగా సీనియర్ పత్రిక్యేయులు పాష సయ్యద్ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జర్నలిస్టులందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలి.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత పై మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినందున తమ హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర జర్నలిస్ట్ హెల్త్ కమిటీ సభ్యులు, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు జారీ చేసి ప్రభుత్వ, కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు అన్నింటిలోనూ క్యాష్ లెస్ వైద్య సేవలు అందేలా, ఆరోగ్యశ్రీ కింద ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లును సకాలంలో చెల్లించి వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

